Loading...
Number 1 All Rounder: ధోనీ కాదు.. యువరాజ్ కాదు.. ప్రపంచంలోనే నంబర్-1 పవర్ హిట్టర్ ఇతడేనంట!
ధోనీ కాదు.. యువరాజ్ కాదు.. ప్రపంచంలోనే నంబర్-1 పవర్ హిట్టర్ ఇతడేనంట!

Number 1 All Rounder: ధోనీ కాదు.. యువరాజ్ కాదు.. ప్రపంచంలోనే నంబర్-1 పవర్ హిట్టర్ ఇతడేనంట!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 04, 2026
03:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఇటీవల ఇచ్చిన ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో ప్రపంచ క్రికెట్‌లో తన దృష్టిలో ఉన్న అత్యుత్తమ ఆల్‌రౌండర్లు, అత్యంత పవర్‌ఫుల్ బ్యాటర్లు ఎవరో వెల్లడించాడు. అయితే ఆల్‌రౌండర్ల జాబితా చెబుతున్న సమయంలో జరిగిన ఒక ఆసక్తికర సంఘటన అభిమానులను ఆకట్టుకుంది. మొదట తన జాబితాలో దక్షిణాఫ్రికా దిగ్గజం జాక్స్ కల్లిస్‌కు తొలి స్థానం, హార్దిక్ పాండ్యాకు రెండో స్థానం, కపిల్ దేవ్‌కు మూడో స్థానం ఇచ్చాడు. అయితే, కొద్దిసేపటికే టీమిండియా మాజీ స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ పేరును మర్చిపోయానని గుర్తించిన అర్ష్‌దీప్ సరదాగా స్పందించాడు.

వివరాలు

మొదటి స్థానంలో యువరాజ్

నేను పంజాబ్‌కు తిరిగి వెళ్లాలి... కాబట్టి యువరాజ్ సింగ్‌ను మర్చిపోవడం కుదరదంటూ నవ్వుతూ తన జాబితాను సవరించాడు.

సవరించిన జాబితాలో యువరాజ్ సింగ్‌ను మొదటి స్థానంలో ఆ తర్వాత జాక్స్ కల్లిస్, హార్దిక్ పాండ్యా, కపిల్ దేవ్, బెన్ స్టోక్స్‌లకు వరుసగా చోటు కల్పించాడు.

ఈ టాప్-5 జాబితాలో భారత్‌కు చెందిన ముగ్గురు, దక్షిణాఫ్రికా నుంచి ఒకరు, ఇంగ్లాండ్ నుంచి ఒకరు చోటు దక్కించుకున్నారు.

వివరాలు

పవర్ హిట్టర్ల జాబితాలో గేల్‌కు అగ్రస్థానం

ప్రపంచంలోని అత్యంత పవర్‌ఫుల్ బ్యాటర్ల జాబితాను కూడా అర్ష్‌దీప్ వెల్లడించాడు.

వెస్టిండీస్ విధ్వంసకర ఓపెనర్ క్రిస్ గేల్‌కు మొదటి స్థానం ఇచ్చాడు. పంజాబ్ కింగ్స్ తరఫున గేల్‌తో కలిసి ఆడిన అనుభవాన్ని గుర్తు చేసుకున్న అర్ష్‌దీప్, నెట్స్‌లో గేల్ ఎంతో ప్రశాంతంగా బ్యాటింగ్ చేసేవాడని, కానీ మ్యాచ్ ప్రారంభమైన వెంటనే తొలి బంతి నుంచే భారీ సిక్సర్లతో విరుచుకుపడేవాడని చెప్పాడు.

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి రెండో స్థానం, యువరాజ్ సింగ్‌కు మూడో స్థానం ఇచ్చాడు.

నాలుగు, ఐదు స్థానాల్లో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు మాథ్యూ హేడెన్, ఆండ్రూ సైమండ్స్‌లను ఎంపిక చేశాడు.

అయితే హేడెన్, సైమండ్స్‌లతో తాను కలిసి ఆడే అవకాశం రాలేదని అర్ష్‌దీప్ స్పష్టం చేశాడు.

ADVERTISEMENT