IND vs NZ: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. పంత్ దూరం.. అతని స్థానంలో ఎవరంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ (IND vs NZ) కోసం భారత జట్టు పూర్తి సిద్ధంగా ఉంది. అయితే ప్రధాన వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను (Rishabh Pant) అనారోగ్య కారణాలతో సిరీస్ నుంచి తప్పించారు. అతని స్థానంలో విజయ్ హజారే ట్రోఫీలో అద్భుత ప్రదర్శన చేసిన ధ్రువ్ జురెల్ (Dhruv Jurel) జట్టులో చేరాడు. ఆదివారం ధ్రువ్ జురెల్ అధికారికంగా టీమ్‌లో చేరినట్లు బీసీసీఐ వెల్లడించింది. బీసీసీఐ ప్రకటన ప్రకారం శనివారం మధ్యాహ్నం వడోదరలోని బీసీఏ స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్‌లో పంత్‌కు ఉదర ప్రాంతంలో నొప్పి తగలడంతో అతను తీవ్రమైన అసౌకర్యాన్ని అనుభవించాడు.
Details
ద్రువ్ జురెల్ ఎంపిక
వెంటనే అతడికి ఎంఆర్‌ఐ స్కాన్ చేయించగా, 'సైడ్ స్ట్రెయిన్' అని నిర్ధారణ అయింది. ఈ కారణంగా బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షణలో పంత్‌ను వన్డే సిరీస్ నుంచి తప్పించారు. ధ్రువ్ జురెల్ ఈ సిరీస్‌లో రిజర్వ్ వికెట్ కీపర్‌గా ఉంటాడు. వడోదర బీసీసీఏ స్టేడియంలో నేడు భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే మ్యాచ్ ఆరంభమవుతోంది.