
Bajrang Punia: చిక్కుల్లో రెజ్లర్ బజరంజ్ పూనియా.. 4 ఏళ్ల నిషేధం విధించిన NADA
ఈ వార్తాకథనం ఏంటి
భారత ప్రముఖ రెజ్లర్ బజరంగ్ పునియాపై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (NADA) కఠిన చర్యలు తీసుకుంది.
యాంటీ డోపింగ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు అతనిపై నాలుగేళ్ల నిషేధం విధించింది. ఈ నిర్ణయం పునియాకి ఆటగాడిగా అతని భవిష్యత్తు మీద గట్టి ప్రభావం చూపనుంది.
మార్చి 10న జాతీయ జట్టుకు ఎంపిక ట్రయల్స్ సందర్భంగా డోప్ టెస్ట్ కోసం నమూనా ఇవ్వడానికి బజరంగ్ నిరాకరించడంతో NADA ఈ నిర్ణయానికి వచ్చింది.
అంతకుముందు, ఏప్రిల్ 23న టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన పునియాను NADA తాత్కాలికంగా సస్పెండ్ చేసింది.
అనంతరం, ప్రపంచ రెజ్లింగ్ సంస్థ UWW (యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్) కూడా అతనిపై చర్యలు తీసుకుంది.
వివరాలు
నాడా అధికారిక నోటీసు
ఈ నిషేధంపై బజరంగ్ అప్పీల్ చేశాడు. మే 31న, NADA క్రమశిక్షణా డోపింగ్ ప్యానెల్ (ADDP) నోటీసు జారీ చేయడంతో, అప్పటికే ఉన్న నిషేధాన్ని తాత్కాలికంగా రద్దు చేసింది.
అయితే, జూన్ 23న నాడా అతనికి అధికారిక నోటీసు పంపింది.
ఇదిలా ఉండగా, బజరంగ్ తన సహచర రెజ్లర్ వినేష్ ఫోగట్‌తో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో అతనికి ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించారు.
జూలై 11న బజరంగ్ నేరారోపణలను ధైర్యంగా సవాలు చేశాడు. చివరికి, సెప్టెంబర్ 20, అక్టోబర్ 4న జరిగిన విచారణల తర్వాత ఈ నిషేధం అమలులోకి వచ్చింది.