
Kuldeep Yadav: ఓన్లీ ప్యార్.. చెంపదెబ్బ వివాదానికి ముగింపు!
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2025 సీజన్‌లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) తలపడగా, 14 పరుగుల తేడాతో కోల్‌కతా విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ 190 పరుగులకే పరిమితమైంది.
ఈ మ్యాచ్ ముగిశాక ఢిల్లీ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ చేసిన ఒక పని సోషల్ మీడియాలో దుమారం రేపింది.
మ్యాచ్ అనంతరం మైదానంలో కుల్‌దీప్, కోల్‌కతా ఆటగాడు రింకు సింగ్‌తో నవ్వుతూ సంభాషిస్తూ కనిపించాడు. ఈ సందర్భంగా కుల్‌దీప్ తన స్నేహితుడు రింకు చెంపపై ఒక దెబ్బ వేశాడు.
Details
హార్ట్ సింబల్స్ తో ముగింపు
మొదట రింకు దీనిని సరదాగా తీసుకున్నా, కుల్‌దీప్ మళ్లీ అదే పనిచేయడంతో రింకు కొద్దిగా అసౌకర్యంగా ఫీలైనట్లుగా కనిపించాడు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.
పలువురు నెటిజన్లు కుల్దీప్ యాదవ్ పై విమర్శలు గుప్పించారు. బీసీసీఐ అతని మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కామెంట్లు చేశారు.
అయితే ఈ వివాదానికి త్వరలోనే ముగింపు వచ్చింది. దిల్లీ క్యాపిటల్స్ అధికారికంగా స్పందిస్తూ కుల్‌దీప్ యాదవ్, రింకు సింగ్ ఇద్దరూ కలిసి హార్ట్ సింబల్స్‌తో ఫోజ్ ఇస్తున్న వీడియోను షేర్ చేసింది.
దీనికి 'ఓన్లీ ప్యార్' అనే క్యాప్షన్ జతచేసింది. ఇది రెండు జట్ల మధ్య మంచి స్నేహబంధాన్ని హైలైట్ చేస్తూ వివాదానికి ముగింపు చిహ్నంగా నిలిచింది.