LOADING...
Womens WC 2025: ఫైనల్‌కు ఒక్క రోజే.. టికెట్లు మాత్రం 'కమింగ్ సూన్'లోనే!
ఫైనల్‌కు ఒక్క రోజే.. టికెట్లు మాత్రం 'కమింగ్ సూన్'లోనే!

Womens WC 2025: ఫైనల్‌కు ఒక్క రోజే.. టికెట్లు మాత్రం 'కమింగ్ సూన్'లోనే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 01, 2025
02:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహిళల వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఫైనల్‌కు చేరి చారిత్రక ఘనత సాధించింది. ఆదివారం నాడు దక్షిణాఫ్రికాతో టైటిల్‌ పోరులో తలపడనుంది. నవీ ముంబయిలోని డీవై పాటిల్‌ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఇంత కీలకమైన పోరుకు టికెట్ల విక్రయం ఇప్పటికే పూర్తయ్యి ఉండి ఉంటుందని అభిమానులు భావించారు. అయితే ఆశ్చర్యకరంగా ఇప్పటి వరకు టికెట్లు అమ్మకానికి అందుబాటులో లేవు. ఈ విషయం సోషల్‌ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. అభిమానులు బీసీసీఐ, ఐసీసీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద ఫైనల్‌ మ్యాచ్‌కి టికెట్లను సకాలంలో విడుదల చేయకపోవడం ఎలా? అంటూ ఫ్యాన్స్‌ విమర్శలు గుప్పిస్తున్నారు

Details

బ్లాక్ మార్కెట్ కు తరలిస్తారని అనుమానం

. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌ టికెట్ విక్రయానికి 'బుక్ మై షో' అధికారిక భాగస్వామి అయినప్పటికీ, వెబ్‌సైట్‌లో ఇప్పటికీ 'Coming Soon' అని మాత్రమే చూపిస్తోందని అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. టోర్నీ మొత్తం కాలంలో కనీస టికెట్ ధర రూ.100గా ఉండగా, బుక్‌మై షోలో మాత్రం రూ.150గా చూపిస్తున్నారని అభిమానులు ఆరోపిస్తున్నారు. టికెట్ల విక్రయాన్ని చివరి నిమిషంలో ప్రారంభించి, తర్వాత 'ఫుల్' అని చూపించి, బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు అమ్ముతారేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫైనల్‌ కోసం ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉండగా కూడా టికెట్లు అందుబాటులో లేకపోవడం సిగ్గుచేటు.

Details

దక్షిణాఫ్రికాతో పోటీపడనున్న భారత మహిళల జట్టు

ఈ విధానం అవినీతికి దారితీస్తుందని కొందరు సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. ఇదే తరహా సమస్య గత వన్డే ప్రపంచకప్‌ సమయంలోనూ ఎదురయ్యిందని అభిమానులు గుర్తుచేశారు. అప్పుడూ కొన్ని మ్యాచ్‌ల టికెట్లు చివరి క్షణాల్లో విడుదల చేసినట్లు విమర్శలు వచ్చాయి. సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాపై అద్భుతమైన విజయంతో భారత్‌ ఫైనల్‌ బరిలోకి అడుగుపెట్టగా, మరోవైపు దక్షిణాఫ్రికా కూడా కష్టపడి తుది పోరుకు చేరింది. ఈ ఫైనల్‌లో గెలిచే జట్టు తొలిసారి మహిళల వన్డే ప్రపంచకప్‌ ఛాంపియన్‌గా అవతరించనుంది.