దోహా, దుబాయి లీగ్ నుండి తప్పుకున్న ఒన్స్ జబీర్
ట్యునీషియా టెన్నిస్ స్టార్ ఒన్స్ జబీర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఓ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. ఈనెల చివరిలో డబ్య్లూటీఎ టోర్నమెంట్ లు, ఖతార్ ఓపెన్, దుబాయి టెన్నిస్ ఛాంపియన్ షిప్ నుండి తప్పుకుంటున్న బుధవారం పేర్కొంది. ఈ ఏడాది చివర్లో చిన్న సర్జరీ చేయించుకుంటానని, అందువల్ల ఈ సిరీస్ దూరమవుతున్నట్లు తెలియజేసింది. జబీర్ 2022లో మెరుగైన ప్రదర్శనతో సత్తా చాటింది. ఆమె రెండుసార్లు గ్రాండ్ స్లామ్ ఫైనల్ చేరుకొని చరిత్రకెక్కింది. మహిళల టెన్నిస్ అసోసియేషన్ (WTA) ర్యాంకింగ్స్‌లో 5210 పాయింట్లతో ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతోంది. ఫిట్ నెస్ సమస్యల కారణంగా ఆటకు దూరమవుతున్నానని, అయితే మళ్లీ తిరిగొస్తానని స్పష్టం చేసింది.
అభిమానులందరికీ క్షమాపణలు చెప్పిన జబీర్
తాను తిరిగి కోర్టులోకి ఆడుగు పెట్టాలంటే చిన్న సర్జరీ చేయించుకోవాలని, దీని కోసం ఖతార్ ఓపెన్, దుబాయి టెన్నిస్ కు దూరం కావాల్సి వస్తుందని జబీర్ వెల్లడించింది. ఈ నిర్ణయం తనని కలిచి వేసిందని, తన అభిమానులందరికీ క్షమాపణ కోరుతున్నానని తెలిపింది. జబీర్ ఈ సీజన్‌లో టీనేజర్ లిండా నోస్కోవాతో జరిగిన నాకౌట్ పోరులో ఓడిపోయింది. ముఖ్యంగా, జబీర్ గ్రాండ్ స్లామ్ ఈవెంట్‌లోకి వెళ్లే క్రమంలో వెన్నులో చిన్న సమస్య కారణంగా ఇబ్బంది పడింది. దీంతో ఆమె అడిలైడ్ ఇంటర్నేషనల్ 2 మిస్ చేసుకుంది.