Loading...
Ambati Rayudu: యశస్వి జైస్వాల్‌కు కెప్టెన్సీ ఛాన్స్.. అంబటి రాయుడు కీలక వ్యాఖ్యలు
యశస్వి జైస్వాల్‌కు కెప్టెన్సీ ఛాన్స్.. అంబటి రాయుడు కీలక వ్యాఖ్యలు

Ambati Rayudu: యశస్వి జైస్వాల్‌కు కెప్టెన్సీ ఛాన్స్.. అంబటి రాయుడు కీలక వ్యాఖ్యలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 08, 2026
05:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు నిర్వహించనున్న మినీ వేలానికి సన్నాహాలు మొదలయ్యాయి. వేలానికి ముందుగా ఫ్రాంచైజీలు తమ రిటైన్, రిలీజ్‌ జాబితాలను సమర్పించాల్సి ఉంది. మరోవైపు జట్ల మధ్య ఆటగాళ్ల ట్రేడింగ్‌ కూడా కొనసాగుతోంది. ఇప్పటికే సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్‌ అధికారికంగా ఆటగాళ్లను మార్పిడి చేసుకున్నాయి. ఇదిలా ఉంటే, పలువురు మాజీ క్రికెటర్లు మినీ వేలంలో ఫ్రాంచైజీలు అనుసరించాల్సిన వ్యూహాలపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఈ జాబితాలో భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కూడా చేరాడు. ఏ జట్టుకు ఎలాంటి ఆటగాళ్లు అవసరమో తన అభిప్రాయాలను పంచుకున్నాడు.

వివరాలు

ముంబయి, ఆర్సీబీ, గుజరాత్‌కు కీలక సూచనలు

ముంబయి ఇండియన్స్‌కు నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేయగల ఆటగాడు అవసరమని రాయుడు అభిప్రాయపడ్డాడు.

పేస్‌తో పాటు స్పిన్‌ను కూడా సమర్థంగా ఎదుర్కోగల బ్యాటర్‌ ఉండాలని పేర్కొన్నాడు. పంజాబ్ కింగ్స్‌ నుంచి నెహాల్ వధేరా తిరిగి ముంబయి జట్టులోకి వస్తాడని అంచనా వేశాడు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు స్పిన్నర్ అవసరమని, ఆ జట్టు యుజ్వేంద్ర చాహల్‌ వైపు మొగ్గు చూపవచ్చని భావించాడు.

గుజరాత్ టైటాన్స్‌కు పటిష్ఠమైన మిడిలార్డర్ బ్యాటర్ కావాలని, ఆ జట్టు వెంకటేశ్ అయ్యర్‌ను సంప్రదించినా ఆశ్చర్యపోనక్కర్లేదని పేర్కొన్నాడు.

వివరాలు

లఖ్‌నవూ, కోల్‌కతా జట్లకు కెప్టెన్సీ ఎంపికలు

లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌ రిషభ్ పంత్‌ను దిల్లీకి ఇచ్చిందని రాయుడు పేర్కొన్నాడు.

దీంతో ఆ జట్టుకు కెప్టెన్సీ ఖాళీ ఏర్పడిందని, అందుకు యశస్వి జైస్వాల్ మంచి ఎంపిక అవుతాడని అభిప్రాయపడ్డాడు.

మరోవైపు కోల్‌కతా నైట్‌రైడర్స్ కూడా కెప్టెన్ కోసం చూస్తోందని చెప్పాడు. గత కొన్నేళ్లుగా ఆ జట్టు సారథులను మారుస్తూనే ఉందని గుర్తుచేశాడు.

ఈసారి సూర్యకుమార్ యాదవ్‌ను తీసుకుని నాయకత్వ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని అంచనా వేశాడు.

ADVERTISEMENT

వివరాలు

సన్‌రైజర్స్‌కు సామ్ కరన్ ఉపయోగపడతాడు

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి సామ్ కరన్‌లాంటి ఆటగాడు వస్తే ఎంతో ప్రయోజనం ఉంటుందని రాయుడు విశ్లేషించాడు.

ప్యాట్ కమిన్స్ అందుబాటులో ఉండటం కష్టమనే వార్తల నేపథ్యంలో, సామ్ కరన్ ఎస్‌ఆర్‌హెచ్ బౌలింగ్ విభాగానికి బాగా సరిపోతాడని పేర్కొన్నాడు.

అంతేకాకుండా లోయర్ ఆర్డర్‌లోనూ పరుగులు చేయగల సామర్థ్యం అతడికి ఉందని అభిప్రాయపడ్డాడు.

ADVERTISEMENT