LOADING...
IND vs PAK: పాకిస్థాన్ బౌలింగ్ ఎప్పుడూ ప్రమాదకరమే.. టీమిండియాకు దాస్‌గుప్తా హెచ్చరిక
పాకిస్థాన్ బౌలింగ్ ఎప్పుడూ ప్రమాదకరమే.. టీమిండియాకు దాస్‌గుప్తా హెచ్చరిక

IND vs PAK: పాకిస్థాన్ బౌలింగ్ ఎప్పుడూ ప్రమాదకరమే.. టీమిండియాకు దాస్‌గుప్తా హెచ్చరిక

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 21, 2025
09:08 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా కప్ 2025 సూపర్-4 దశ పోటీలు ప్రారంభమయ్యాయి. శనివారం శ్రీలంకపై బంగ్లాదేశ్ అద్భుత విజయం సాధించి మంచి ఆరంభం చేసింది. ఇక ఆదివారం అభిమానులు ఎదురుచూస్తున్న హై-వోల్టేజ్ పోరు ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ దుబాయ్ వేదికగా రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. లీగ్ దశలో ఇప్పటికే పాకిస్థాన్‌ను సులభంగా ఓడించిన టీమిండియా, మరోసారి విజయం సాధించి ఆధిపత్యాన్ని కొనసాగించాలని చూస్తోంది. మరోవైపు లీగ్ మ్యాచ్‌లో జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని పాక్ భావిస్తోంది.

Details

పాక్ జట్టును తేలిగ్గా తీసుకోకూడదు

భారత్-పాకిస్థాన్ పోరుకు ముందుగా భారత మాజీ క్రికెటర్ దీప్ దాస్‌గుప్తా కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్ బౌలింగ్ ఎప్పటికీ ప్రమాదకరమేనని, దాయాది జట్టును అస్సలు తేలికగా తీసుకోరాదని ఆయన హెచ్చరించారు. గత కొన్నేళ్లుగా పాకిస్థాన్ స్థిరమైన ప్రదర్శన ఇవ్వడం లేదు. మంచి ఆటగాళ్లు ఉన్నా, ఓ యూనిట్‌గా రాణించలేకపోతున్నారు. అయినప్పటికీ పాకిస్థాన్ ఎప్పటికీ డేంజరస్ టీమ్. చిన్న నాణ్యత పరంగా భారత్ పాకిస్థాన్ కంటే చాలా ముందుంది. అయినప్పటికీ పాక్ బౌలింగ్ ఎప్పటికీ బలంగానే ఉంటుంది. వారి బ్యాటింగ్ మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ఆసియా కప్ 2025లో కూడా పాకిస్థాన్ బ్యాటింగ్ సమస్యలతోనే సతమతమవుతోంది. కానీ వారి బౌలింగ్ మాత్రం ఎప్పటికీ పటిష్టమే. అండర్‌డాగ్స్‌గా ఉన్న పాక్‌ను సీరియస్‌గా తీసుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు.

Details

ముగ్గురు స్పిన్నర్లు బరిలోకి దిగాలి

ఆసియా కప్ 2025లో ఇప్పటివరకు భారత జట్టుకు గట్టి సవాళ్లు ఎదురుకాలేదు. కానీ సూపర్-4లో అసలైన పోటీ ప్రారంభమవుతుంది. పాకిస్థాన్‌తో పాటు బంగ్లాదేశ్, శ్రీలంకలతోనూ భారత్ పోటీ పడాలి. ఇప్పటివరకు మన ప్రదర్శన బాగానే ఉంది. లోపాలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దుబాయ్‌లో మూడు స్పిన్నర్లను ఆడించాలనే నిర్ణయం సరైందే అని దాస్‌గుప్తా చెప్పారు. దుబాయ్ మ్యాచ్‌లో అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలు బరిలోకి దిగనున్నారు. మొత్తం మీద, ఆసియా కప్ సూపర్-4లో భారత్-పాక్ పోరు మరింత ఉత్కంఠభరితంగా మారింది.