అంపైర్‌ని కొట్టిన పాక్ క్రికెటర్..!
కరాచీలో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య బుధవారం రెండో వన్డే జరిగింది. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ 79 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఇంగ్లాడ్ చేతిలో టెస్టు సిరీస్ ను కూడా పాకిస్తాన్ కోల్పోయింది. తొలి వన్డేలో నెగ్గిన పాకిస్తాన్ రెండో వన్డేలో చిత్తుగా ఓడింది. అయితే రెండో వన్డేలో అసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. పాకిస్థాన్ ఆటగాడు విసిరిన బాల్ అంపైర్ కాలుకు తాకింది. దీంతో ఆయన తనవద్ద ఉన్న పాక్ క్రికెటర్ జెర్సీని నేలకేసి కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జెర్సీని కిందకేసి కొట్టిన అంపైర్
262 పరుగుల లక్ష్య చేధనకు దిగిన పాకిస్తాన్ 43 ఓవర్లో 282 పరుగులకి ఆలౌట్ అయ్యింది. పాక్ కెప్టెన్ బాబార్ ఆజమ్ 114 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్ తో 79 పరుగులు, రిజ్వాన్ 50 బంతుల్లో 28 పరుగులు చేశాడు. 36 ఓవర్లో గ్లెన్ ఫిలిప్స్ కొట్టిన బంతిని ఆపిన మహ్మద్ వసీం బలంగా వికెట్లకు బంతిని విసిరాడు. అయితే ఆ బంతి నేరుగా వెళ్లి అంపైర్ అలీం దార్ కాలికి తగిలింది. దీంతో అంపైర్‌కు కోపం కట్టలు తెచ్చుకుంది. వెంటనే అంపైర్.. తన వద్ద ఉన్న పాక్ క్రికెటర్ జెర్సీని నేలకేసి కొట్టాడు. పాక్ క్రికెటర్ నసీం అంపైర్ వద్దకు వెళ్లి మోకాలు కింద భాగంలో మసాజ్ చేశాడు.