ODI World Cup 2023 : పాక్ వరుస పరాజయాలు.. అయినా బిర్యానీలు, చేపలను లాగిస్తున్న ఆటగాళ్లు
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో పాకిస్థాన్ జట్టు వరుస పరాజయాలతో సతమతమవుతోంది. ఇప్పటికే సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. అయినా పాక్ ఆటగాళ్లు ఓటమి బాధను పక్కన పెట్టి ఇండియాలో ఫుడ్‌ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఏడేళ్ల తర్వాత వరల్డ్ కప్ మ్యాచుల కోసం తొలిసారి హైదరాబాద్‌లో పాక్ ఆటగాళ్లు అడుగుపెట్టారు. ఇక్కడ బిర్యాని తిన్న పాక్ ఆటగాళ్లు చాలా బాగుందని, ప్రశంసల వర్షం కురిపించారు. అయితే వరల్డ్ కప్ మ్యాచుల కోసం వెళ్లిన ప్రతి చోట బిర్యాని లాగించేశారు. అయితే ఇటీవలే కోల్ కతా చేరుకున్న పాక్ ఆటగాళ్లు బిర్యానీ కోసం చేసిన పని అందరికి ఆశ్చర్యానికి గురి చేసింది.
జోమోటా ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసుకున్న పాక్ ఆటగాళ్లు
ఇవాళ పాకిస్థాన్‌తో బంగ్లాదేశ్ తలపడనుంది. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరగనున్న ఈ మ్యాచ్ కోసం పాక్ ప్లేయర్లు హోటల్ కు చేరుకున్నారు. వారు ఉంటున్న హోటల్‌లో బిర్యానీ లేదని ఫుడ్ తినడానికి నిరాకరించారు. ఇక పాక్ ప్లేయర్లు జోమాటోలో బిర్యాని ఆర్డర్ చేసుకున్నారు. జోమోటా ద్వారా కోల్ కతాలోని ఫేమస్ రెస్టారెంట్‌లలో చాప్, ఫిర్నీ, కాబాబ్ లు, షాహి తుక్డా, బిర్యానీలు ఆర్డర్ చేసుకొని బాగా లాగించినట్లు తెలిసింది. ఇక వరల్డ్ కప్‌లో ఆడిన ఆరు మ్యాచుల్లో రెండు సాధించి, నాలుగు మ్యాచుల్లో ఓడింది. నేడు బంగ్లాదేశ్ పై ఓడితే పాక్ వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించనుంది.