LOADING...
Smriti Mandhana: స్మృతి మందన్న పెళ్లి రద్దు తర్వాత పలాశ్ ముచ్చల్‌పై కొత్త వివాదం
స్మృతి మందన్న పెళ్లి రద్దు తర్వాత పలాశ్ ముచ్చల్‌పై కొత్త వివాదం

Smriti Mandhana: స్మృతి మందన్న పెళ్లి రద్దు తర్వాత పలాశ్ ముచ్చల్‌పై కొత్త వివాదం

వ్రాసిన వారు Moogati Shabari
May 06, 2026
10:35 am

ఈ వార్తాకథనం ఏంటి

సంగీత దర్శకుడు పలాశ్‌ ముచ్చల్‌ చిక్కుల్లో పడ్డారు. భారత మహిళా క్రికెట్ స్టార్ ప్లేయర్ స్మృతి మందాన్న ఫ్రెండ్‌ విజ్ఞాన్ ప్రకాశ్‌ ఇచ్చిన ఫిర్యాదుతో మహారాష్ట్రలోని సంగ్లీ పోలీసులు పలాశ్‌పై ఎస్సీ/ఎస్టీ కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక సినిమా ప్రాజెక్టు కోసం పలాశ్‌ తనవద్ద రూ.25 లక్షలు తీసుకున్నారని విజ్ఞాన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆరు నెలల్లో సినిమా పూర్తి చేస్తానన్న ఆయన.. ఆ తర్వాత తనను మోసం చేశారని విజ్ఞాన్ ఆరోపించారు.

వివరాలు

స్మృతి ఫ్రెండ్‌ పలాశ్‌పై కేసు

గత ఏడాది నవంబరు 22న సంగ్లీ-అష్టా రహదారిపై ఉన్న టోల్ ప్లాజా వద్ద ఈ డబ్బుల విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో పలాశ్‌ ముచ్చల్ తన కులాన్ని ఉద్దేశించి దూషించారని, అసభ్య పదజాలంతో అవమానించారని విజ్ఞాన్‌ ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతేడాదిలో నవంబర్‌లో స్మృతి మందన్న, పలాశ్‌ ముచ్చల్‌ పెళ్లి రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. నవంబరు 23న వీరి పెళ్లి జరగాల్సిఉండగా.. అనూహ్య పరిణామాల మధ్య ఆ వేడుక ఆగిపోయింది. తాజాగా స్మృతి ఫ్రెండ్‌ పలాశ్‌పై కేసు పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Advertisement