Page Loader
 Pardeep Narwal: కబడ్డీకి పర్దీప్ నర్వాల్ రిటైర్మెంట్
కబడ్డీకి పర్దీప్ నర్వాల్ రిటైర్మెంట్

 Pardeep Narwal: కబడ్డీకి పర్దీప్ నర్వాల్ రిటైర్మెంట్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 03, 2025
05:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

కబడ్డి ప్లేయర్ ప్రదీప్ నర్వాల్ షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్నాడు. ప్రొఫెషనల్ కబడ్డీ నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించాడు. ఇటీవల ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్) 2025 వేలంలో ఏ జట్టు కూడా అతన్ని ఎంపిక చేయకపోవడంతో, ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించాడు. 28 ఏళ్ల హర్యానా రైడర్‌ తన రిటైర్మెంట్ విషయాన్ని ప్రముఖ స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టర్ సునీల్ తనేజాతో ఓ లైవ్ ఇంటరాక్షన్‌లో వెల్లడించాడు. ఈ సమాచారం తెలిసిన వెంటనే ఆయన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. పీకేఎల్ చరిత్రలో అత్యధికంగా 1801 రైడ్ పాయింట్లు సాధించిన ఆయన. ఒక్కో మ్యాచ్‌కు సగటున 9.47 పాయింట్లు రాబట్టారు.

Details

కోచింగ్ వైపు దృష్టి పెడతానని ప్రకటన

తన ఫిట్‌నెస్, ఆటతీరు ద్వారా ఎన్నో విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. పాట్నా పైరేట్స్‌కు ప్రదీప్ అందించిన విజయాలు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ జట్టు మూడు టైటిల్స్ గెలవడంలో అతని పాత్ర అపారమైనది. గత నాలుగు సీజన్లుగా ప్రదీప్ ఫామ్‌లో లేకపోవడంతో యూపీ యోధాస్, బెంగళూరు బుల్స్ తరఫున పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో లీగ్ 12వ సీజన్ వేలంలో అతనిని ఏ జట్టు తీసుకోవడానికి ఆసక్తి చూపలేదు. ఇది ప్రదీప్‌ను తీవ్రంగా కలిచివేసినట్లు తెలుస్తోంది. ఇకపై తాను కోచింగ్ వైపు దృష్టిపెడతానని ప్రకటించాడు.