LOADING...
IPL 2026: కాటేరమ్మ కొడుకు వచ్చేస్తున్నాడు.. ఎస్ఆర్‌హెచ్‌కు గుడ్ న్యూస్..బెంగళూరులో బిగ్ ట్విస్ట్!
కాటేరమ్మ కొడుకు వచ్చేస్తున్నాడు.. ఎస్ఆర్‌హెచ్‌కు గుడ్ న్యూస్..బెంగళూరులో బిగ్ ట్విస్ట్!

IPL 2026: కాటేరమ్మ కొడుకు వచ్చేస్తున్నాడు.. ఎస్ఆర్‌హెచ్‌కు గుడ్ న్యూస్..బెంగళూరులో బిగ్ ట్విస్ట్!

వ్రాసిన వారు Moogati Shabari
Mar 24, 2026
10:52 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్ ప్రారంభానికి సమయం దగ్గరపడింది. ఈ నెల 28వ తేదీ నుంచి టోర్నీ మొదలుకానుంది. తొలి మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్‌ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ ప్రారంభ పోరుకు బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం వేదిక కానుంది. ప్రస్తుతం మొత్తం 10 జట్లు తమ తమ ప్రిపరేషన్స్‌లో బిజీగా ఉన్నాయి. ఆటగాళ్లు ఒక్కొక్కరుగా జట్లతో చేరుతూ, తీవ్రంగా సాధన కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మంచి సమాచారం అందింది. గాయం కారణంగా మొదటి మ్యాచ్‌లకు దూరమవుతాడని అనుకున్న ఆ జట్టు కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాడు. ఆయన నేడు నేరుగా బెంగళూరుకు చేరుకుని జట్టుతో కలవనున్నారు.

వివరాలు

ఆడతాడా? లేదా? 

అయితే ఆర్సీబీతో జరిగే ప్రారంభ మ్యాచ్‌లో ఆయన ఆడతారా లేదా అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ కమ్మిన్స్ ఆడకపోతే, ముందుగా నిర్ణయించినట్లుగా ఓపెనర్ ఇషాన్ కిషన్ ఆ మ్యాచ్‌కు నాయకత్వం వహించనున్నాడు. వెన్నునొప్పి నుంచి కమ్మిన్స్ కోలుకోవడంతో ఆయన రాకపై ఉన్న సందేహాలు తొలగిపోయాయి. మరోవైపు, కొత్తగా జట్టులోకి వచ్చిన జాక్ ఎడ్వర్డ్స్ కాలి గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకోవడంతో జట్టుపై కొంత ఒత్తిడి పెరిగింది. కానీ కమ్మిన్స్ తిరిగి చేరడం ఆ ఒత్తిడిని కొంతవరకు తగ్గించినట్లు భావిస్తున్నారు. ఐపీఎల్ ప్రారంభానికి ముందు జరగనున్న కెప్టెన్ల సమావేశానికి ఇషాన్ కిషన్ హాజరవుతాడు. కమ్మిన్స్ ముందుగానే నగరానికి చేరుకున్నా కూడా, ఆ సమావేశంలో ఇషాన్ కిషన్ పాల్గొనడం ఖరారైంది.

వివరాలు

మిచెల్ స్టార్క్ పరిస్థితి కూడా అంతే..

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు చెందిన మిచెల్ స్టార్క్ విషయంలో ఇంకా స్పష్టత లేదు. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని రూ.11.75 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఈ ఎడమచేతి పేసర్ ఇప్పటికీ జట్టుతో కలవలేదు. క్రికెట్ ఆస్ట్రేలియా అతని వర్క్‌లోడ్‌ను పర్యవేక్షిస్తున్నట్టు సమాచారం. స్టార్క్ కోసం అవసరమైన ఎన్‌ఓసీ కోసం ఇప్పటికీ ఎదురుచూస్తున్నామని ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ హేమంగ్ బదానీ వెల్లడించాడు. క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి అనుమతి వచ్చిన తర్వాతే స్టార్క్ జట్టులో చేరే సమయం ఖరారవుతుందని బదానీ తెలిపారు. అలాగే డీసీ డైరెక్టర్ వేణుగోపాల్ రావు కూడా స్టార్క్ రాకపై ఆశాభావం వ్యక్తం చేశారు. క్లియరెన్స్ లభించిన వెంటనే జట్టుతో కలుస్తాడని ఆయన పేర్కొన్నారు.

Advertisement