Page Loader
స్వియాటెక్ పై జెస్సికా పెగులా విజయం
విజయం సాధించినా జెస్సికా పెగులా

స్వియాటెక్ పై జెస్సికా పెగులా విజయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 06, 2023
11:57 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ నంబర్ వన్ ఇగా స్వియాటెక్ పై 6-2, 6-2 తేడాతో జెస్సిగా పెగులా విజయం సాధించింది. శుక్రవారం జరిగిన ఓపెనింగ్ సింగిల్స్ రబ్బర్‌లో జెస్సిగా పెగులా యూనైటెడ్ స్టేట్ కు మంచి అరంభాన్ని అందించింది. స్వియాటెక్ తన సర్వీస్‌ను ఒకసారి మాత్రమే నిలబెట్టుకోవడంతో పెగులా 5-0 అధిక్యంలోకి దూసుకెళ్లింది. స్వియాటెక్ ఒత్తిడి లోనై.. రెండు సెట్లో రాణించలేకపోయింది. స్వియాటెక్ పై పెగులా విజయం సాధించడంతో ఈ నెలలో జరిగే ఆస్ట్రేలియా ఓపెన్స్ కి అర్హత సాధించింది.

జెస్సికా పెగులా

దూకుడుగా ఆడినందుకు విజయం వరించింది

తాను దూకుడిగా ఆడి, ముందుకెళ్లడంతోనే స్వియాటెక్ పై విజయం సాధించానని పెగులా చెప్పింది. గత నాలుగు మ్యాచ్ లో పెగులా స్వియాటెక్ పై ఓడిపోయిన విషయం తెలిసిందే. అమెరికన్లకు 2-0 ఆధిక్యాన్ని అందించాలని ఫ్రాన్సెస్ టియాఫో చూస్తున్నాడు. అయితే టియాఫో తర్వాత కాపర్ జుక్ తో తలపడాల్సి ఉంటుంది. సెమీ-ఫైనల్‌లో గ్రీస్ ఇటలీతో తలపడినప్పుడు సాయంత్రం సెషన్‌లో మరియా, సక్కరి మధ్య పోరు కొనసాగనుంది.