
IPL 2025: భారత్-పాక్ యుద్ధం.. బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఐపీఎల్ నిరవధికంగా వాయిదా..!
ఈ వార్తాకథనం ఏంటి
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ని నిరవధికంగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.
భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా నెలకొన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
గురువారం ధర్మశాలలో జరిగిన పంజాబ్ మరియు ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్ సగంలోనే ఆపివేసిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్ జమ్మూ కశ్మీర్, పఠాన్‌కోఠ్ ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్ దాడులు, వైమానిక దాడుల నేపథ్యంలో రద్దు చేయబడింది.
ఈ ఘటనల కారణంగా, అక్కడ ఉన్న క్రికెటర్లు, మైదాన సిబ్బంది, ప్రసార బృందాన్ని సురక్షితంగా తరలించేందుకు బీసీసీఐ ప్రత్యేక రైలును ఏర్పాటు చేసింది.
వివరాలు
లీగ్ నిరవధికంగా వాయిదా
ప్రస్తుత సరిహద్దు పరిస్థితులు ఐపీఎల్ నిర్వహణకు అనుకూలంగా లేవని, ఈ పరిస్థితుల్లో లీగ్ కొనసాగించటం సమంజసం కాదని బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపారు.
ఈ క్రమంలోనే లీగ్‌ను నిరవధికంగా వాయిదా వేసినట్లు ఆ అధికారి వివరించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఐపీఎల్ నిరవధికంగా వాయిదా..!
IPL suspended indefinitely due to India-Pakistan military conflict: BCCI official
— Press Trust of India (@PTI_News) May 9, 2025