Team India: 2027 వరల్డ్‌కప్ లక్ష్యంగా ప్రణాళిక.. జట్టులో మార్పులు తప్పవన్న గిల్!
ఈ వార్తాకథనం ఏంటి
ఇంగ్లండ్‌తో ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన తొలి వన్డేలో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన అనంతరం భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ జట్టు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు. ముఖ్యంగా ఒత్తిడి పరిస్థితుల్లో మిడిల్ ఆర్డర్ చూపిన పోరాట పటిమపై ప్రశంసలు కురిపించాడు. అలాగే 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని జట్టులో కొత్త కాంబినేషన్లను పరీక్షించే ప్రక్రియను కొనసాగిస్తామని స్పష్టం చేశాడు.
వివరాలు
ఒత్తిడిని తట్టుకుని విజయం
259 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఒక దశలో 160 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది.
అయితే వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ అజేయ భాగస్వామ్యంతో జట్టును విజయతీరాలకు చేర్చారు.
ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యం సాధించింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన గిల్.. మాపై ఒత్తిడి వచ్చినా జట్టు తిరిగి పుంజుకున్న తీరు ఎంతో కీలకం.
ఇలాంటి సమయంలో మిడిల్ ఆర్డర్, లోయర్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు పరుగులు చేసి మ్యాచ్‌ను ముగిస్తే కెప్టెన్‌గా ఎంతో ఆత్మవిశ్వాసం వస్తుందని చెప్పాడు.
వివరాలు
2027 వరల్డ్‌కప్ కోసం కొత్త కాంబినేషన్లు
దక్షిణాఫ్రికా వేదికగా జరిగే 2027 ఐసీసీ వన్డే ప్రపంచకప్‌కు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని గిల్ వెల్లడించాడు.
ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని మేము వివిధ కాంబినేషన్లను పరీక్షిస్తూనే ఉంటాం. ప్రతి మ్యాచ్‌లో జట్టుకు ఏది ఉత్తమమో తెలుసుకునే ప్రయత్నం చేస్తామని ఆయన పేర్కొన్నాడు.
ముగ్గురు ఆల్‌రౌండర్లతో భారత్
ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు ముగ్గురు ఆల్‌రౌండర్లతో బరిలోకి దిగింది. వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అక్షర్ పటేల్‌లకు తుది జట్టులో చోటు కల్పించారు.
అదనపు బ్యాటర్‌ను నంబర్-8లో ఆడించేందుకు రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను ఈ మ్యాచ్‌కు పక్కన పెట్టారు.
వివరాలు
300 పరుగుల లక్ష్యమైనా ఛేదించే నమ్మకం
భారత బ్యాటింగ్ బలంపై గిల్ పూర్తి విశ్వాసం వ్యక్తం చేశాడు. అవసరమైతే 300 నుంచి 320 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా ఛేదించగల సామర్థ్యం తమ జట్టుకు ఉందని చెప్పాడు.
మా బౌలింగ్ దళం యువ ఆటగాళ్లతో ఉంది. అయితే బ్యాటింగ్ విభాగంలో అనుభవం ఎక్కువగా ఉంది.
అందుకే 300-320 పరుగుల లక్ష్యమైనా ఛేదించగలమనే నమ్మకం మాకు ఉందని గిల్ పేర్కొన్నాడు.
పవర్‌ప్లే చివర్లో ఇంగ్లండ్ వేగంగా పరుగులు చేసినప్పటికీ, ఆ తర్వాత మధ్య ఓవర్లలో భారత బౌలర్లు మ్యాచ్‌పై పట్టు సాధించిన తీరు ప్రశంసనీయమని గిల్ తెలిపాడు.
ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టారని ఆయన కొనియాడాడు.