LOADING...
#Play of the day: సొంత గూటిలో శార్దూల్ జోరు.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌తో మెరిసిన పేసర్
సొంత గూటిలో శార్దూల్ జోరు.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌తో మెరిసిన పేసర్

#Play of the day: సొంత గూటిలో శార్దూల్ జోరు.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌తో మెరిసిన పేసర్

వ్రాసిన వారు Moogati Shabari
Mar 30, 2026
11:59 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ పేసర్ శార్దూల్ ఠాకూర్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. వాంఖడే స్టేడియం అనే తన హోమ్ గ్రౌండ్‌లో కేకేఆర్ బ్యాటర్లను పూర్తిగా అదుపులో పెట్టాడు. ముఖ్యంగా టాప్ ఆర్డర్‌ను కుదిపేసి అజింక్య రహానే, ఫిన్ అలెన్, కామెరాన్ గ్రీన్ వంటి కీలక ఆటగాళ్ల వికెట్లు తీసి జట్టు విజయానికి ప్రధాన కారణంగా నిలిచాడు. 39 పరుగులు ఇచ్చి 3 వికెట్లు సాధించిన శార్దూల్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డును అందుకున్నాడు. అతని కట్టుదిట్టమైన బౌలింగ్ వల్ల కేకేఆర్ భారీ స్కోరు చేయకుండా నిలువరించగలిగాడు.

వివరాలు 

హార్దిక్ పాండ్యా కామెంట్స్ వైరల్

మ్యాచ్ ముగిసిన తర్వాత ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా శార్దూల్ ప్రదర్శనపై ప్రశంసలు కురిపించాడు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన మాటలు కూడా చెప్పాడు. శార్దూల్ గొప్ప వ్యక్తిత్వం కలిగిన ఆటగాడని, అతనికి పెద్ద మనసుందని అన్నారు. బ్యాటర్లను ఎలా ఇబ్బంది పెట్టాలో అతడికి బాగా తెలుసని, తాను అతనికి ఒక్కటే చెప్పానని, ఇక ఫ్రాంచైజీలు మారడం ఆపేయ్. నీ కెరీర్ పూర్తయ్యే వరకు ముంబై ఇండియన్స్‌కే కట్టుబడి ఉండాలని తాను కోరుకుంటున్నట్లు పాండ్యా తెలిపాడు. శార్దూల్ లాంటి ఆటగాడు జట్టులో ఉండటం తమకు ఎంతో బలం అని ఆయన అన్నారు.

వివరాలు 

శార్దూల్ ఐపీఎల్ ప్రయాణం ఇలా..

శార్దూల్ ఠాకూర్ ఐపీఎల్ కెరీర్‌ను పరిశీలిస్తే, ఇప్పటివరకు అతను ఆరు వేర్వేరు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, రైజింగ్ పూణే సూపర్‌జెయింట్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లలో అతను సభ్యుడిగా ఉన్నాడు. అయితే ఇప్పుడు తన సొంత నగరమైన ముంబై జట్టులోకి రావడం అతనికి ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చింది. గతంలో 2010 నుంచి 2012 వరకు శార్దూల్ ముంబై ఇండియన్స్‌కు నెట్ బౌలర్‌గా సేవలందించాడు. అదే జట్టులో ఇప్పుడు కీలక ఆటగాడిగా మారి మ్యాచ్ విన్నర్‌గా నిలవడం అతనికి ఎంతో సంతోషాన్ని కలిగించింది.

Advertisement

వివరాలు 

సొంత జట్టులో అద్భుత క్షణాలు..

'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు అందుకున్న తర్వాత శార్దూల్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ముంబై తన స్వస్థలమని, ఇక్కడ ఆడటం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు. తనను లక్నో నుంచి ట్రేడ్ చేసి, మొదటి మ్యాచ్‌లోనే అవకాశం ఇచ్చిన ముంబై ఇండియన్స్ కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు. 15 సంవత్సరాల క్రితం ఇక్కడే తాను నెట్ బౌలర్‌గా ఉన్నానని, ఇప్పుడు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు సంపాదించడం గర్వంగా ఉందన్నారు. హార్దిక్ చెప్పినట్టే, తన కెరీర్ ముగిసే వరకు ఇక్కడే కొనసాగాలని ఆశిస్తున్నట్లు శార్దూల్ చెప్పాడు. అంతేకాకుండా, వాంఖడే స్టేడియం గ్రౌండ్ సిబ్బందికి గౌరవ సూచకంగా హార్దిక్ పాండ్యా ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున చెక్కులు అందజేసి తన ఉదారతను ప్రదర్శించాడు.

Advertisement