Virat Kohli: దయచేసి నన్ను అడగకండి.. ఇంటి నుంచే మ్యాచులను చూడాలని స్నేహితులకు విరాట్ కోహ్లీ రిక్వెస్ట్
వన్డే వరల్డ్ కప్ 2023 సమరం భారత గడ్డపై రేపటి నుంచి ప్రారంభం కానుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచులను ప్రత్యక్షంగా మైదానంలో ఉండి చూసేందుకు ఎక్కవ మంది అభిమానులు ఆసక్తి చూపుతుంటారు. ఇప్పటికే టికెట్లకు అదిరిపోయే స్పందన లభించింది. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కీలక సూచన చేశాడు. విరాట్ కోహ్లీ ద్వారా టికెట్లు సంపాదించాలని అతని స్నేహితులు భావిస్తుంటారు. ఈ తరుణంలో తమకు టికెట్లు ఇప్పించాలని విరాట్ ను కోరుతున్నట్లు తెలిసింది. తన దగ్గరికి వచ్చే స్నేహితులకు విరాట్ కోహ్లీ ముఖ్య సూచన చేశాడు.
టికెట్లు అడగొద్దన్న విరాట్ కోహ్లీ
ప్రపంచ కప్ టికెట్ అభ్యర్థనల కోసం తనను సంప్రదించవద్దని, ప్రపంచ కప్ మ్యాచులను ఇంటి నుంచే చూసి ఎంజాయ్ చేయాలని విరాట్ కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. ఇప్పటికే ఈ మెగా టోర్నీ కోసం టికెట్ల ధరలు రికార్డులను సృష్టిస్తున్నాయి. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఒక టికెట్ ధర రూ.56 లక్షలకు చేరిందంటే డిమాండ్ ఏ మేరకు ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ అక్టోబర్ 14న జరగనుంది.