LOADING...
Womens World Cup Champions: మహిళల వన్డే ప్రపంచ కప్‌-2025 గెలిచిన జట్టును అభినందించిన మోదీ.. 
మహిళల వన్డే ప్రపంచ కప్‌-2025 గెలిచిన జట్టును అభినందించిన మోదీ..

Womens World Cup Champions: మహిళల వన్డే ప్రపంచ కప్‌-2025 గెలిచిన జట్టును అభినందించిన మోదీ.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 06, 2025
11:59 am

ఈ వార్తాకథనం ఏంటి

మహిళల వన్డే వరల్డ్‌ కప్‌-2025 ఫైనల్‌లో విజయం సాధించి చరిత్ర సృష్టించిన భారత మహిళా క్రికెట్‌ జట్టు నిన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసి శుభాకాంక్షలు అందుకుంది. ఈ సందర్బంగా జట్టుతో పాటు ప్రధాన కోచ్‌ అమోల్‌ మజుందార్‌ కూడా మోదీని కలిసిన వారిలో ఉన్నారు. జట్టు ఘనతను ప్రధాన మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. వరల్డ్‌ కప్‌ లీగ్‌ దశలో మూడు మ్యాచ్‌లలో పరాజయం పాలైనా తరువాత అద్భుతంగా తిరిగి బరిలోకి దిగిన టీమిండియా పోరాట స్పూర్తిని మోదీ గుర్తుచేసుకుని ప్రశంసలు కురిపించారు.

వివరాలు 

ఫైనల్‌ పోరులో భారత్‌ 52 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం

మహిళా క్రికెటర్లతో మోదీ మాట్లాడి, భారతదేశంలో క్రికెట్‌ కేవలం ఒక క్రీడ మాత్రమే కాదని, అది కోట్లాది అభిమానుల జీవన విధానంలో భాగమైందని పేర్కొన్నారు. ఈ భేటీకి సంబంధించిన వీడియోను మోదీ ఇవాళ తన ఎక్స్‌ (Twitter) ఖాతాలో షేర్‌ చేశారు. కాగా, ఫైనల్‌ పోరులో భారత్‌ 52 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించిన విషయం తెలిసిందే. 52 ఏళ్ల మహిళల వన్డే వరల్డ్‌ కప్‌ చరిత్రలో భారత్‌ తొలిసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది.

వివరాలు 

ప్రపంచకప్‌ గెలిచిన జట్లు 

1973 - ఇంగ్లాండ్ 1977/78 - ఆస్ట్రేలియా 1981/82 - ఆస్ట్రేలియా 1988/89 - ఆస్ట్రేలియా 1993 - ఇంగ్లాండ్ 1997/98 - ఆస్ట్రేలియా 2000/01 - న్యూజిలాండ్ 2004/05 - ఆస్ట్రేలియా 2008/09 - ఇంగ్లాండ్ 2012/13 - ఆస్ట్రేలియా 2017 - ఇంగ్లాండ్ 2021/22 - ఆస్ట్రేలియా 2025/26 - భారత్

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బీసీసీఐ విమెన్ చేసిన ట్వీట్