FIFA World Cup: పోర్చుగల్‌కు షాక్.. స్పెయిన్ విజయం.. కంటతడి పెట్టిన రొనాల్డో..
ఈ వార్తాకథనం ఏంటి
ఫిఫా ప్రపంచకప్‌లో పోర్చుగల్ జట్టు ప్రయాణం ముగిసింది. స్పెయిన్‌తో జరిగిన కీలక పోరులో 1-0 తేడాతో పరాజయం పాలవడంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇప్పటికే ఇదే తన చివరి ప్రపంచకప్ అని ప్రకటించిన పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు ఈ మ్యాచ్‌తో ప్రపంచకప్ కెరీర్ ముగిసినట్లైంది. మ్యాచ్ అనంతరం రొనాల్డో తీవ్ర భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టడం అభిమానులను కలచివేసింది. స్పెయిన్ తరఫున మైకెల్ మెరీనో చేసిన ఏకైక గోల్ మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించింది. ఈ విజయంతో స్పెయిన్ క్వార్టర్‌ఫైనల్స్‌కు అర్హత సాధించింది. 2010లో ప్రపంచకప్ టైటిల్‌ను సొంతం చేసుకున్న తర్వాత స్పెయిన్ జట్టు క్వార్టర్‌ఫైనల్స్‌కు చేరుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మెరీనో గోల్‌తో స్పెయిన్ క్వార్టర్స్‌లోకి.. పోర్చుగల్ టోర్నీకి వీడ్కోలు
Devastation for Cristiano Ronaldo 💔
— ESPN (@espn) July 6, 2026
He was in tears after Portugal were eliminated from a goal in the 91st minute by Mikel Merino of Spain in stoppage time. pic.twitter.com/Oy9yKLQaYM