LOADING...
Praful Hinge: వైభవ్ సూర్యవంశీ తుఫాన్‌కు బ్రేక్ వేసిన హింగే.. ఎస్ఆర్‌హెచ్ బౌలర్ అదుర్స్
వైభవ్ సూర్యవంశీ తుఫాన్‌కు బ్రేక్ వేసిన హింగే.. ఎస్ఆర్‌హెచ్ బౌలర్ అదుర్స్

Praful Hinge: వైభవ్ సూర్యవంశీ తుఫాన్‌కు బ్రేక్ వేసిన హింగే.. ఎస్ఆర్‌హెచ్ బౌలర్ అదుర్స్

వ్రాసిన వారు Moogati Shabari
May 27, 2026
11:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌ రైజర్స్ హైదరాబాద్‌ (SRH) పేసర్ ప్రజుల్ హింగే అద్భుత ప్రదర్శన చేశాడు. బుధవారం రాజస్థాన్ రాయల్స్‌ (RR)తో జరిగిన మ్యాచ్‌లో హింగే 3 వికెట్లు తీసి తన జట్టుకు కీలక బ్రేక్‌త్రూలు అందించాడు. ఈ మ్యాచ్ న్యూ చండీగఢ్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి భారీగా 243 పరుగులు చేసింది. ముఖ్యంగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతని ధాటికి హైదరాబాద్ జట్టు బౌలర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

వివరాలు

మరింత దూకుడుగా బౌలింగ్..

అయితే ప్రజుల్ హింగే కీలక సమయంలో వికెట్లు తీసి రాజస్థాన్ జోరును కొంత మేర తగ్గించాడు. యశస్వి జైస్వాల్‌తో కలిసి సూర్యవంశీ వేగంగా 125 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ ప్రమాదకర జోడీని విడదీసింది హింగేనే. దూకుడుగా ఆడుతున్న సూర్యవంశీని ఔట్ చేసి SRHకు ఊరటనిచ్చాడు. అంతేకాకుండా మూడో వికెట్‌కు వచ్చిన 55 పరుగుల భాగస్వామ్యాన్ని కూడా హింగే చెరిపేశాడు.

వివరాలు

ఐపీఎల్ రికార్డులు ఇవే..

అర్ధశతకం సాధించిన ధ్రువ్ జురెల్‌ను పెవిలియన్‌కు పంపించాడు. తర్వాత కెప్టెన్ రియాన్ పరాగ్ వికెట్ కూడా తీసి రాజస్థాన్‌ను 16వ ఓవర్లో 207/4 స్కోరుకు పరిమితం చేశాడు. ఇదిలా ఉంటే, ఇదే ప్రజుల్ హింగేకు తొలి ఐపీఎల్ సీజన్. డెబ్యూ సీజన్‌లోనే అతడు ఆకట్టుకునే ప్రదర్శన చేస్తున్నాడు. ఇప్పటివరకు 7 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు పడగొట్టి మంచి గుర్తింపు సంపాదించాడు. అతని సగటు 21.78గా ఉండగా, ఎకానమీ రేట్ మాత్రం 11.73గా ఉంది.

Advertisement