Loading...
Pragyan Ojha: టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. త్వరలోనే అధికారిక ప్రకటన?
టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. త్వరలోనే అధికారిక ప్రకటన?

Pragyan Ojha: టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. త్వరలోనే అధికారిక ప్రకటన?

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 30, 2026
10:43 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రికెట్ జట్టు తదుపరి చీఫ్ సెలెక్టర్‌గా మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అజిత్ అగార్కర్ చీఫ్ సెలెక్టర్ పదవి నుంచి తప్పుకున్న నేపథ్యంలో.. ప్రస్తుతం సెలెక్షన్ కమిటీ తాత్కాలిక అధిపతిగా వ్యవహరిస్తున్న 39 ఏళ్ల ఓజానే పూర్తిస్థాయి చీఫ్ సెలెక్టర్‌గా నియమించే అవకాశం ఉందని సమాచారం.

వివరాలు 

గంభీర్‌తో సెలెక్టర్ల కీలక భేటీ

మంగళవారం గువాహటిలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో నలుగురు సభ్యుల సెలెక్షన్ కమిటీ సుదీర్ఘంగా సమావేశమైంది.

వెస్టిండీస్‌తో రెండో వన్డేకు ఒక రోజు ముందు బర్సపరా స్టేడియంలో ఈ భేటీ జరిగింది.

ప్రజ్ఞాన్ ఓజాతో పాటు శివ సుందర్ దాస్, అజయ్ రాత్రా, ఆర్‌పీ సింగ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే మాజీ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మాత్రం హాజరుకాలేదు.

సాధారణంగా ద్వైపాక్షిక సిరీస్ జరుగుతున్న సమయంలో సెలెక్షన్ కమిటీ మొత్తం సమావేశం కావడం అరుదుగా జరుగుతుంది.

దీంతో ఓజాను పూర్తిస్థాయి చీఫ్ సెలెక్టర్‌గా నియమించే అంశంపై నిర్ణయం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది.

వివరాలు 

న్యూజిలాండ్ పర్యటనపై ప్రధాన చర్చ

త్వరలో ప్రారంభం కానున్న న్యూజిలాండ్ పర్యటన కోసం భారత జట్ల ఎంపికపైనే ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు సమాచారం.

అక్టోబర్ 22 నుంచి నవంబర్ 27 వరకు సాగే ఈ సుదీర్ఘ పర్యటనలో టీమిండియా ఐదు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది.

అదే సమయంలో అక్టోబర్ 24 నుంచి న్యూజిలాండ్‌లో మూడు టెస్టులు ఆడనున్న భారత్ 'ఎ' జట్టును కూడా ఎంపిక చేయాల్సి ఉంది.

దీంతో సీనియర్ జట్టుతో పాటు భారత్ 'ఎ' జట్టు ఎంపికపైనా సెలెక్టర్లు దృష్టి పెట్టాల్సి ఉంటుంది.

ADVERTISEMENT

వివరాలు 

వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కీలకం

టీమిండియా వరుస సిరీస్‌లతో బిజీగా ఉండటంతో ఆటగాళ్ల వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కొత్త సెలెక్షన్ కమిటీకి కీలక సవాలుగా మారనుంది.

ఆటగాళ్లకు తగిన విశ్రాంతి కల్పిస్తూనే.. భవిష్యత్ సిరీస్‌లకు అవసరమైన జట్టు కూర్పును సిద్ధం చేయాల్సి ఉంటుంది.

2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని జట్టును నిర్మించేందుకు న్యూజిలాండ్ పర్యటన కీలకంగా మారనుంది.

సీనియర్ జట్టు అవసరాలను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు.. భారత్ 'ఎ' కార్యక్రమాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడం ఓజా నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ముందున్న ప్రధాన బాధ్యతగా మారనుంది.

ADVERTISEMENT