IPL: ఐపీఎల్ స్టార్‌కు ధోని ఫైనాన్షియల్ అడ్వైజ్..ఏం చెప్పాడంటే
ఈ వార్తాకథనం ఏంటి
చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన ఆల్‌రౌండర్ ప్రశాంత్ వీర్ ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. తనకు ధోనీ ఇచ్చిన సలహా గురించి వివరంగా చెప్పాడు. ఐపీఎల్ వేలంలో ప్రశాంత్ వీర్‌కు రూ.14.2 కోట్ల భారీ ధర లభించిన విషయం తెలిసిందే. రూ.30 లక్షల కనీస ధరతో వేలంలో ప్రవేశించిన అతడిని దక్కించుకోవడానికి పలు జట్లు పోటీపడ్డాయి. ముఖ్యంగా లక్నో, ముంబయి, చెన్నై, రాజస్థాన్ జట్లు తీవ్రంగా ప్రయత్నించాయి. చివరికి అతడు భారీ మొత్తానికి చెన్నై జట్టులో చేరాడు.
వివరాలు
ధోనీ ఇచ్చిన సలహా ఇదే
ఇటీవల చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ప్రశాంత్ వీర్, ధోనితో జరిగిన తన సంభాషణను పంచుకున్నాడు. ధోని తనకు డబ్బును వృథా చేయకుండా జాగ్రత్తగా ఖర్చు చేయాలని సూచించినట్లు తెలిపాడు. ప్రశాంత్ వీర్ మాట్లాడుతూ..ఇప్పటివరకు మేమిద్దరం క్రికెట్ గురించి ఎక్కువగా మాట్లాడుకోలేదని, అయితే ఆయన తనకు డబ్బును పొదుపుగా ఉపయోగించుకోవాలని, అవసరం లేని ఖర్చులను నివారించాలని సూచించినట్లు తెలిపారు.