Page Loader
Lalit Modi: నా కెరీర్‌ను ముగించేస్తానని లలిత్ మోదీ బెదిరించాడు: ప్రవీణ్ కుమార్ సంచలన కామెంట్స్ 
Lalit Modi: నా కెరీర్‌ను ముగించేస్తానని లలిత్ మోదీ బెదిరించాడు: ప్రవీణ్ కుమార్ సంచలన కామెంట్స్

Lalit Modi: నా కెరీర్‌ను ముగించేస్తానని లలిత్ మోదీ బెదిరించాడు: ప్రవీణ్ కుమార్ సంచలన కామెంట్స్ 

వ్రాసిన వారు Stalin
Jan 09, 2024
03:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత జట్టు మాజీ ఫాస్ట్ బౌలర్ ప్రవీణ్ కుమార్ సంచలన విషయాన్ని వెల్లడించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మొదటి సీజన్ ఎంపిక సమయంలో మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ తనను బెదిరించారని చెప్పారు. తన మాట వినకపోతే తన కెరీర్‌ను ముగించేస్తానని బెదిరించినట్లు పేర్కొన్నారు. 2008లో మొదటి ఐపీఎల్ సీజన్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ సీజన్ ఎంపిక సమయంలో తాను దిల్లీకి ఆడాలని అనుకున్నానని, కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపు (RCB) ఆడాలని లలిత్ మోదీ ఒత్తిడి తెచ్చినట్లు వివరించారు. తాజాగా ఆయన 'ది లాలాన్‌టాప్‌' యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు.

ఐపీఎల్

ఒప్పందంపై బలవంతంగా సంతకం చేయించారు: ప్రవీణ్ కుమార్

వేలం సమయంలో ఒక వ్యక్తి తనతో కాగితంపై బలవంతంగా సంతకం చేయించారని, అప్పడు ఆ పేపర్లో ఏం రాసిందో తనకు తెలియదని ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆ తర్వాత అది RCB కాంట్రాక్ట్ అని తెలిసిందన్నారు. వాస్తవానికి తాను RCBకి ఆడాలని అనుకోలేదన్నారు. తన ఇల్లు మీరట్‌లో ఉంటుందని, అక్కడి నుంచి బెంగళూరు చాలా దురమని, తనకు ఇంగ్లీష్ రాదని, అలాగే అక్కడి ఆహారం కూడా తన నచ్చదని ప్రవీణ్ పేర్కొన్నారు. ఈ క్రమంలో తాను తన ఇంటికి దగ్గరైన దిల్లీ తరఫున ఆడాలని అనుకున్నట్లు చెప్పుకొచ్చారు. కానీ తన ఓ వక్తి బలవంతంగా సంతకం చేయించినట్లు గుర్తు చేసారు. బలవంతంగా సంతకం చేయించింది ఎవరో కాదని లలిత్ మోదీ అని వెల్లడించారు.

ఐపీఎల్

బెంగళూరు తరఫున హ్యాట్రిక్ సాధించిన తొలి బౌలర్

ప్రవీణ్ కుమార్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున 47 మ్యాచ్‌లు ఆడి 41 వికెట్లు పడగొట్టాడు. ఈ రైట్ ఆర్మ్ పేసర్ ఆర్సీబీకి హ్యాట్రిక్ కూడా అందించారు. 2010లో రాజస్థాన్ రాయల్స్‌పై హ్యాట్రిక్ వికెట్లను తీసుకున్నాడు. బెంగళూరు తరఫున ఐపీఎల్‌లో హ్యాట్రిక్‌ సాధించిన తొలి బౌలర్‌గా నిలిచారు. ఇది కాకుండా ప్రవీణ్ పంజాబ్ కింగ్స్ (అప్పటి కింగ్స్ ఎలెవన్ పంజాబ్) తరపున కూడా ఆడాడు. అతను 2011- 2013 మధ్య ఆ టీమ్ తరఫున ఆడారు. 2014లో జరిగిన వేలంలో ప్రవీణ్ కుమార్ అమ్ముడుపోలేదు. కానీ టోర్నమెంట్ మధ్యలో, ముంబై ఇండియన్స్ అతన్ని జహీర్ ఖాన్‌కు ప్రత్యామ్నాయంగా తీసుకుంది.