Page Loader
Prithvi Shah: రంజీ జట్టుకు పృథ్వీ షా దూరం.. అధిక బరువే కారణమా?
రంజీ జట్టుకు పృథ్వీ షా దూరం.. అధిక బరువే కారణమా?

Prithvi Shah: రంజీ జట్టుకు పృథ్వీ షా దూరం.. అధిక బరువే కారణమా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 22, 2024
12:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రతిభావంతుడైన యువ క్రికెటర్ పృథ్వీ షా ప్రస్తుతం కష్టకాలంలో ఉన్నాడు. ఇతర క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్‌లో విజయాలు సాధిస్తున్నా, 24 ఏళ్ల పృథ్వీ షా మాత్రం నిరంతరం వివాదాల్లో చిక్కుకోవడంతో ఆటపై దృష్టి పెట్టలేకపోతున్నాడు. ప్రస్తుతం అతడు భారత జట్టుకు దూరంగా ఉండటమే కాకుండా, రంజీ ట్రోఫీ జట్టులో కూడా చోటు కోల్పోవడం గమనార్హం. ముంబయి రంజీ టీమ్‌లో పృథ్వీ షాను ఎంపిక చేయకపోవడానికి స్పష్టమైన కారణాలు వెల్లడించలేదు. కానీ ఫిట్‌నెస్‌, క్రమశిక్షణ లోపం కారణంగా అతడిపై వేటు పడినట్లు తెలుస్తోంది. నెట్ సెషన్స్‌కు ఆలస్యంగా రావడం, కొన్ని సందర్భాల్లో డుమ్మా కొట్టడం వంటి కారణాల వల్ల ముంబయి క్రికెట్ అసోసియేషన్ అతడిపై చర్య తీసుకుంది.

Details

అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న పృథ్వీ షా

అతడి ఫిట్‌నెస్ కూడా సంతృప్తికరంగా లేదట, దీంతో అతను అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నాడని సమాచారం. ఈ నిర్ణయాన్ని ముంబయి క్రికెట్ అసోసియేషన్ సెలక్టర్లు మాత్రమే కాకుండా, కెప్టెన్, కోచ్ కూడా సమర్థించినట్లు సమాచారం. 18 ఏళ్ల వయసులోనే భారత జట్టు తరఫున టెస్టు కెరీర్‌ ప్రారంభించిన పృథ్వీ షా, తొలి మ్యాచ్‌లోనే సెంచరీ కొట్టి అబ్బురపరిచాడు. ఇప్పుడు టీమిండియాకు దూరమయ్యాడు. ప్రతిభకు లోటు లేకపోయినా, క్రమశిక్షణా లోపం, ఫిట్‌నెస్‌ లేకపోవడంతో అతడి కెరీర్‌ను చేజేతులా నాశనం చేస్తున్నాడు.