
Prithvi Shaw : ముంబై జట్టుపై సెంచరీతో గర్జించిన పృథ్వీ షా
ఈ వార్తాకథనం ఏంటి
భారత దేశవాళీ క్రికెట్‌లో ఒకప్పుడు సంచలనం సృష్టించిన యువ ఓపెనర్ పృథ్వీ షా ఇటీవల తన సొంత జట్టు ముంబైని వీడి, మహారాష్ట్ర జట్టులో చేరారు. ఫిట్‌నెస్, క్రమశిక్షణ సమస్యల కారణంగా ముంబై జట్టులో తన స్థానాన్ని కోల్పోయి తీవ్ర నిరాశలో ఉన్న షా, ఇప్పుడు తన బ్యాటింగ్‌తోనే విమర్శకులకు, ముఖ్యంగా బీసీసీఐ సెలెక్టర్లకు గట్టి సందేశం ఇచ్చారు. రంజీ ట్రోఫీ 2025-26 సీజన్‌కు ముందు, మహారాష్ట్ర తరపున ముంబైతో జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో పృథ్వీ షా అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 140 బంతుల్లో 186 పరుగులు చేయడం ద్వారా తన పాత జట్టు బౌలర్లపై ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు.
Details
దేశవాళీ క్రికెట్ లో నూతన అధ్యాయం ప్రారంభం
కొన్ని సంవత్సరాలుగా ఫామ్ లోపం, ఫిట్‌నెస్ సమస్యలు క్రమశిక్షణలో విఫలమయ్యారన్న ఆరోపణలతో షా భారత జట్టు, చివరకు ముంబై దేశవాళీ జట్టుకు దూరమయ్యారు. విజయ్ హజారే ట్రోఫీకి ముంబై జట్టులో చోటు దక్కకపోవడంతో షా ఒక భావోద్వేగ పోస్టు పెట్టి తన బాధను వ్యక్తపరిచాడు. ఈ నేపథ్యంలో తనను పక్కన పెట్టిన మాజీ జట్టుపై సెంచరీ చేయడం ద్వారా షా తన ఆవేదనను ప్రత్యక్షంగా వ్యక్తపరిచారు. ముంబై క్రికెట్ అసోసియేషన్ నుంచి 'నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్' (NOC) పొందిన తర్వాత, పృథ్వీ షా దేశవాళీ క్రికెట్‌లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. బుచ్చిబాబు టోర్నమెంట్‌లో ఛత్తీస్‌గఢ్‌పై కూడా సెంచరీ చేసి తన సామర్థ్యాన్ని నిరూపించారు.