Page Loader
పృథ్వీషా ఆల్ టైం రికార్డు
ట్రిపుల్ సెంచరీ చేసిన పృథ్వీ షా

పృథ్వీషా ఆల్ టైం రికార్డు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 11, 2023
05:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా ఆల్ టైం రికార్డు సృష్టించాడు. రంజీ ట్రోఫీలో ట్రిపుల్ సెంచరీ బాదాడు. అస్సాంతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై తరుపున బరిలోకి దిగన పృథ్వీషా (383 బంతుల్లో 49 ఫోర్లు, 4 సిక్స్ లతో 379) పరుగులు చేశాడు. రంజీ ట్రోఫీ ఇన్నింగ్స్‌లో 350 కంటే ఎక్కువ పరుగులు చేసిన తొమ్మిదో బ్యాటర్‌గా నిలిచాడు. ముంబై తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన క్రికెటర్‌గా షా సరికొత్త చరిత్రను సృష్టించాడు. గౌహతిలోని అమిన్‌గావ్ క్రికెట్ గ్రౌండ్‌లో అస్సాం టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. షా ఆరంభం నుంచి బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. కేవలం 107 బంతుల్లో వంద పరుగులు పూర్తి చేశాడు.

పృథ్వీ షా

పృథ్వీ షా రికార్డులివే

డిసెంబర్ 1948లో కథియావార్‌పై మహారాష్ట్ర తరపున అజేయంగా భౌసాహెబ్ నింబాల్కర్ 443 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు. రంజీ ట్రోఫీ 2016-17 సెమీ-ఫైనల్‌లో తమిళనాడుపై షా అరంగేట్రం చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 120 పరుగులు చేసి, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. FC క్రికెట్‌లో 41 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 15 అర్ధసెంచరీలు, 12సెంచరీలు ఉన్నారు. మొత్తం 3,623 పరుగులను కలిగి ఉన్నాడు. 2018లో స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో షా తన అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 134 పరుగులు చేశాడు. ఐదు టెస్టు మ్యాచ్‌ల్లో 42.37 సగటుతో 339 టెస్టు పరుగులు చేశాడు.