
PSL: ఐపీఎల్‌కు పోటీగా పీఎస్ఎల్..? సెంచరీ కొట్టిన ప్లేయర్‌కు ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసా..!
ఈ వార్తాకథనం ఏంటి
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు ప్రత్యామ్నాయంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)ను నిర్వహిస్తోంది.
పీఎస్ఎల్‌కి కూడా అంతర్జాతీయ క్రికెటర్లతో పాటుగా ప్రత్యేకమైన గుర్తింపు రావాలన్న ఆశతో పీసీబీ ఈ లీగ్‌ను ముందుకు తీసుకెళ్తోంది.
అయితే పీఎస్ఎల్ ఐపీఎల్‌ను మించిందంటూ పాక్ మాజీ క్రికెటర్లు తరచూ గొప్పలు చెప్పినా, వాస్తవానికి మైదానంలో పరిస్థితులు భిన్నంగానే కనిపిస్తున్నాయి.
Details
అవునా.. ఇంత గిఫ్టేనా..?
పీఎస్ఎల్ 2025 సీజన్ ఏప్రిల్ 11న ప్రారంభమైంది. అయితే ఈ సీజన్‌కి ప్రేక్షకుల స్పందన మామూలుగానే ఉంది.
ఇదే సమయంలో ఏప్రిల్ 12న కరాచీ కింగ్స్, ముల్తాన్ సుల్తాన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక ప్రత్యేక సంఘటన చర్చనీయాంశమైంది.
ఈ మ్యాచ్‌లో ముల్తాన్ తరఫున రిజ్వాన్ అదిరిపోయే సెంచరీ (63 బంతుల్లో 105 పరుగులు)తో రాణించగా, జేమ్స్ విన్స్ (43 బంతుల్లో 101) చెలరేగిపోవడంతో కరాచీకింగ్స్ విజయం సాధించింది.
విన్స్‌కు హెయిర్ డ్రయర్..?
విన్స్ అద్భుత ప్రదర్శన కారణంగా కరాచీ కింగ్స్ 19.2 ఓవర్లలో 235 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
మ్యాచ్ అనంతరం జేమ్స్ విన్స్‌కి 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది.
Details
నెటిజన్ల సెటైర్లు
అంతటితో ఆగకుండా, డ్రెస్సింగ్ రూమ్‌లో మరో అవార్డు కూడా అందించాడు జట్టు యాజమాన్యం - 'రిలయబుల్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అంటూ ఓ హెయిర్ డ్రయర్‌ను బహుమతిగా ఇచ్చారు.
ఇదంతా వీడియో రూపంలో కరాచీ కింగ్స్ తమ అధికార సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది.
ఈ వీడియో నెట్టింట్లో కాస్త హాట్ టాపిక్‌గా మారింది. నెటిజన్లు గిప్ట్‌పై వినూత్నంగా స్పందిస్తున్నారు.
ఇచ్చిన బహుమతి చూస్తుంటే.. గల్లీ క్రికెట్‌లో ఇచ్చే గిఫ్ట్‌లు కూడా వీటికంటే మెరుగ్గానే ఉంటాయంటూ కొన్ని కామెంట్లు వెలువడ్డాయి.
మరికొందరు ఇలా అయితే తదుపరి మ్యాచుల్లో బాగా ఆడితే షాంపూలు, షేవింగ్ క్రీమ్స్ గిఫ్ట్‌గా ఇవ్వొచ్చేమోనని సైటర్లు వేస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
James Vince is the Dawlance Reliable Player of the Match for his game-changing performance against the Multan Sultans! 💙❤️#YehHaiKarachi | #KingsSquad | #KarachiKings pic.twitter.com/PH2U9FQl5a
— Karachi Kings (@KarachiKingsARY) April 13, 2025