
IPL PBKS vs GT: గుజరాత్ టైటాన్స్'ని ఓడించిన పంజాబ్ కింగ్స్
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్-18 సీజన్‌లో పంజాబ్ తన తొలి విజయం సాధించింది.అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌పై 11 పరుగుల తేడాతో గెలుపొందింది.
244 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జట్టు, 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 232 పరుగులకే పరిమితమైంది.
సాయి సుదర్శన్ (74), బట్లర్ (54) అర్ధశతకాలు సాధించినప్పటికీ, విజయాన్ని అందించలేకపోయారు.
పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ 2 వికెట్లు పడగొట్టగా, మాక్స్‌వెల్ మరియు యాన్సెన్ చెరో వికెట్ తీశారు.
వివరాలు
శ్రేయస్ అయ్యర్, శశాంక్ సింగ్ ఊచ కోత
టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్, 20 ఓవర్లలో 5 వికెట్లకు 243 పరుగులు చేసింది.
శ్రేయస్ అయ్యర్ (97*; 42 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సులు) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
అతడు భారీ షాట్లతో స్కోరు బోర్డును పరుగెత్తించాడు. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన 17వ ఓవర్లో వరుసగా 6,4,6,6 కొట్టాడు.
మ్యాచ్ చివర్లో శశాంక్ సింగ్ (44*; 16 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులు) మెరుపు ప్రదర్శన అందించాడు.
19 ఓవర్లు పూర్తయ్యేసరికి 97 పరుగుల వద్ద ఉన్న శ్రేయస్ అయ్యర్ కు చివరి ఓవర్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు.
వివరాలు
సాయి కిశోర్ 3 వికెట్లు
చివరి ఓవర్‌లో స్ట్రైక్‌లో ఉన్న శశాంక్ ఏకంగా ఐదు ఫోర్లు బాదాడు. మ్యాచ్ ప్రారంభంలో ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య (47; 23 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సులు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
మ్యాక్స్‌వెల్ (0) నిరాశపరిచాడు. సాయి కిశోర్ బౌలింగ్‌లో ఎదుర్కొన్న తొలి బంతికే ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.
ప్రభ్‌సిమ్రన్ సింగ్ 5 (8), అజ్మతుల్లా ఒమర్జాయ్ 16 (15), స్టాయినిస్ 20 (15) పరుగులు చేశారు.
గుజరాత్ బౌలర్లలో సాయి కిశోర్ 3 వికెట్లు తీసుకున్నాడు. రబాడ, రషీద్ ఖాన్ తలో వికెట్ సాధించారు.