
Punjab Kings: పంజాబ్ కింగ్స్ గట్టి ఎదురుదెబ్బ.. టోర్నీ మధ్యలో కీలక ఆటగాడు ఔట్!
ఈ వార్తాకథనం ఏంటి
పంజాబ్ కింగ్స్‌కు ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభంలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ గాయం కారణంగా ఈ సీజన్ నుంచి తప్పుకున్నాడు.
ఈ సీజన్‌లో శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని పంజాబ్ బలంగా కనిపిస్తుండగా, ఫెర్గూసన్ గైర్హాజరీ జట్టుకు ఊహించని నష్టంగా మారింది.
ఉప్పల్ స్టేడియంలో ఇటీవల సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో, ఫెర్గూసన్ కేవలం రెండు బంతులే వేసి తీవ్ర కాలినొప్పితో మైదానం విడిచాడు.
ఎడమ తొడ భాగాన్ని పట్టుకుని నొప్పితో కష్టపడుతున్నట్లు కనిపించగా, ఫిజియో సాయం తీసుకున్న తర్వాత స్టేడియం నుంచి నేరుగా బయటకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత మళ్లీ బౌలింగ్ చేయలేదు.
Details
రేసులో వైశాక్ విజయ్ కుమార్
ఆ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 246 పరుగుల లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు కోల్పోయి ఛేదించి చరిత్ర సృష్టించింది.
లాకీ ఫెర్గూసన్ లేని పరిస్థితే పంజాబ్ జట్టు బౌలింగ్ దళాన్ని దెబ్బతీసిందని, అతని గైర్హాజరీలో ప్రత్యర్థి జట్టుకు భారీ స్కోర్ చేయడానికి అవకాశం కలిగిందని కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వ్యాఖ్యానించాడు.
అతను అవసరమైన సమయంలో వికెట్లు తీసే బౌలర్ అని పొగిడాడు. ఇప్పుడు ఫెర్గూసన్ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్నది పంజాబ్‌కు కీలక ప్రశ్నగా మారింది.
ఆ జట్టులో ఆస్ట్రేలియా పేసర్ జేవియర్ బార్ట్‌లెట్, ఆఫ్ఘన్ ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ వంటి విదేశీ ఎంపికలతో పాటు భారతీయ బౌలర్ వైశాక్ విజయ్ కుమార్ కూడా ఉన్నారు
Details
గతంలో కూడా గాయాలు
. వైశాక్ ఇప్పటి వరకు ఒకే ఒక్క మ్యాచ్ ఆడినా అందులో మెరుగైన ప్రదర్శన చేశాడు. ఫెర్గూసన్ కి నవంబర్ 2024 తర్వాత ఇది అతనికి మూడో గాయం.
ఫిబ్రవరిలో UAEలో జరిగిన ఇంటర్నేషనల్ లీగ్ T20లో ఫెర్గూసన్ కు తొడ కండరాల గాయం తగిలింది. దాని వల్ల ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా దూరమయ్యాడు.
అంతకుముందు శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లోనూ కాలినొప్పితో పాల్గొనలేకపోయాడు.
ఇప్పటి వరకు ఐపీఎల్ 2025 సీజన్‌లో పంజాబ్ జట్టు ఆడిన 5 మ్యాచ్‌ల్లో నాలుగింటిలో బౌలింగ్ విభాగం 200 కంటే ఎక్కువ పరుగులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఫెర్గూసన్ లేని పరిస్థితే పంజాబ్ విజేతగా నిలవాలన్న ఆశలను గణనీయంగా తగ్గించే అవకాశం ఉంది.