Page Loader
PV Sindhu: ఆపిల్ సీఈఓ టిమ్‌కుక్‌తో పీవీ సింధు సెల్ఫీ
ఆపిల్ సీఈఓ టిమ్‌కుక్‌తో పీవీ సింధు సెల్ఫీ

PV Sindhu: ఆపిల్ సీఈఓ టిమ్‌కుక్‌తో పీవీ సింధు సెల్ఫీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 13, 2023
04:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా టెక్ దిగ్గజం ఆపిల్ తన కొత్త ఐఫోన్‌లను కాలిఫోర్నియాలో మంగళవారం ఆవిష్కరించింది. ఈ కార్యక్రమానికి బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు హజరయ్యారు. ఈ సందర్భంగా ఆపిల్ సీఈఓ టిమ్‌కుక్‌ తో కలిసి సింధు సెల్ఫీని దిగింది. ఈ ఫోటోను తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో సింధు పంచుకుంది. ఆపిల్ కుపెర్టినోలో కిట్ రోజున టిమ్ కుక్ ను కలుసుకున్నానని, ఇది మరుపురాని క్షణమని, అద్భుతమైన ఆపిల్ పార్కును చూడడం, కుక్ ను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని పివి.సింధు రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోటో సోషల్ మీడియా వేదికగా వైరల్‌గా మారింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 టిమ్ కుక్ తో సెల్ఫీ దిగిన పీవీ సింధు