Ravichandran Ashwin: రవిచంద్రన్ అశ్విన్ ఆస్తి ఎన్ని కోట్లో తెలుసా?
టీమిండియా స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ తన ప్రత్యేకమైన టెక్నిక్‌తో ప్రత్యర్థులను ఇబ్బంది పెడతాడు. ముఖ్యంగా టెస్టుల్లో, అశ్విన్ క్యారమ్ బాల్ సంధించడంలో దిట్ట, ఇది ప్రత్యర్థి బ్యాటర్లకు నిద్రలేకుండా చేస్తుంది. పిచ్ కొంచెం స్పిన్‌కు అనుకూలిస్తే అశ్విన్ మరింత ప్రమాదకరంగా మారతాడు. అనిల్ కుంబ్లే తర్వాత ఇంతటి ప్రతిభ చూపించిన స్పిన్నర్ అశ్విన్ మాత్రమే. బ్యాటింగ్‌లో కూడా తన సత్తా చాటుతూ టీమిండియాకు అవసరమైనప్పుడు మద్దతు అందిస్తాడు.
బంగ్లాతో టెస్టులో విధ్వంసం
ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో అశ్విన్ 113 పరుగుల సూపర్ సెంచరీతో టీమ్‌ను ఆదుకున్నాడు. 101 టెస్టుల్లో 20 సార్లు 50కి పైగా స్కోర్లు చేసి, 36 సార్లు ఐదు వికెట్లు తీయడంలో అశ్విన్ రికార్డులు సాధించాడు.
అశ్విన్ నెట్ వర్త్ ఎంతంటే?
తమిళనాడులోని చెన్నైలో జన్మించిన అశ్విన్, 2024 నాటికి 16 మిలియన్ డాలర్లు అంటే సుమారు 132 కోట్ల ఆస్తిని కలిగి ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. చెన్నైలో విలాసవంతమైన ఇంటితో పాటు, అశ్విన్ వద్ద రూ. 6 కోట్ల విలువైన రోల్స్ రాయిస్, రూ. 93 లక్షల ఆడి క్యూ7 ఉన్నాయి. బీసీసీఐ, ఐపీఎల్ ద్వారా భారీ ఆదాయం బీసీసీఐ తరపున గ్రేడ్-ఏ కాంట్రాక్ట్ పొందిన అశ్విన్, ప్రతి సంవత్సరం రూ. 5 కోట్లు సంపాదిస్తాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతూ మరో రూ. 5 కోట్లు పొందుతున్నాడు.
బ్రాండ్స్, ప్రమోషన్లు
అశ్విన్ జూమ్ కార్, మూవ్, మింత్రా వంటి బ్రాండ్స్ ప్రచారకర్తగా కూడా ఉంది. బాంబే షేవింగ్ కంపెనీ, రామ్ రాజ్ లినెన్ షర్ట్స్ వంటి బ్రాండ్స్ ద్వారా కూడా ఆదాయం పొందుతున్నాడు. కెరీర్‌లో సాధించిన విజయాలు అశ్విన్ 101 టెస్టుల్లో 516 వికెట్లు సాధించి, 3422 పరుగులు చేశాడు. 116 వన్డేల్లో 156 వికెట్లు తీసి, 707 పరుగులు చేశాడు. 65 టీ20ల్లో 184 పరుగులతో పాటు 72 వికెట్లు కూడా తీసాడు.