LOADING...
Ravichandran Ashwin: దూబే ప్రయాణంపై అశ్విన్ షాకింగ్ కామెంట్స్
దూబే ప్రయాణంపై అశ్విన్ షాకింగ్ కామెంట్స్

Ravichandran Ashwin: దూబే ప్రయాణంపై అశ్విన్ షాకింగ్ కామెంట్స్

వ్రాసిన వారు Moogati Shabari
Mar 19, 2026
11:38 am

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 వరల్డ్ కప్ 2026 క్రికెట్ ఫైనల్ తర్వాత శివమ్ దూబే అహ్మదాబాద్ నుంచి ముంబై వరకు రైలులో ప్రయాణించాడు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ విషయంపై భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించారు. దూబే రైలు ప్రయాణంపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇలాంటి విషయాలను కొందరు తప్పుబడతారని, ఇష్టమొచ్చినట్లు కామెంట్స్ చేస్తారని అన్నారు. రైలు ప్రయాణం అనేది ఒక గొప్ప అనుభూతి అని అశ్విన్ తెలిపారు.

వివరాలు

ఎన్నోసార్లు ప్రయాణించా..

ఆ వార్తలను తాను చూసినప్పటికీ, వాటిని చదవాలన్న ఆసక్తి కలగలేదని తెలిపాడు. అది పెద్ద విషయం కాదని ఆయన స్పష్టం చేశాడు. తాను కూడా గతంలో ఎన్నోసార్లు రైలు ప్రయాణం చేశానని చెప్పాడు. సాధారణంగా అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లు ప్రజలతో కలిసి ఉండే అలవాట్లు తగ్గిపోయాయని ఆయన అభిప్రాయపడ్డాడు. టీ స్టాళ్ల వద్ద సాధారణ ప్రజలతో కలిసి టీ తాగడం వంటి చిన్న అనుభవాలు ఎంతో ఆనందాన్ని ఇస్తాయన్నారు. అలాంటి సంతోషాలను మనం మరిచిపోయామని అశ్విన్ అన్నారు. ప్రస్తుతం అశ్విన్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisement