రాహుల్ ద్రవిడ్‌కు అనారోగ్యం, చికత్స కోసం బెంగళూరు
టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అనారోగ్యానికి గురైనట్లు తెలిసింది. శ్రీలంకతో జరిగిన రెండో వన్డే తర్వాత ద్రవిడ్ వైద్య పరీక్షల కోసం బెంగళూరు వెళ్లాడు. రెండు రోజుల క్రితమే ద్రవిడ్ 50వ పుట్టిన రోజు వేడుకులను జరుపుకున్నారు. రక్తపోటు సమస్యతో ఇబ్బంది పడినట్లు సమాచారం. ప్రస్తుతం మూడో వన్డేలో టీమిండియా జట్టులో కలుస్తాడో లేదో వేచి చూడాలి. ద్రవిడ్ కోల్‌కతా నుంచి బెంగళూరుకు ఉదయం విమానంలో వెళ్లినట్లు తెలుస్తోంది. రెండో వన్డేలో రక్తపోటు అధికమైనట్లు తెలిసింది. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ వైద్యులు వైద్య పరీక్షలు చేశారు. అయితే ప్రమాదమేమీ లేదని చెప్పారు.
ద్రవిడ్ అరోగ్యం బాగానే ఉంది
ద్రవిడ్ ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు తెలిపారు. అయితే తిరువనంతపురంలో శ్రీలంకతో జరిగే మూడో వన్డేలో జట్టులో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన రెండో వన్డేలో శ్రీలంకపై భారత్ ఘన విజయం సాధించింది. ద్రవిడ్ ఈ ఏడాది ప్రారంభంలో కోవిడ్ భారీన పడినే విషయం తెలిసిందే. దీంతో జింబాబ్వే పర్యటనకు ద్రవిడ్ దూరమయ్యాడు. అప్పట్లో అతని స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ వెళ్లారు. ద్రవిడ్ నవంబర్ 2021లో టీమ్ ఇండియా ప్రధాన కోచ్‌గా నియమితులయ్యారు. ICC T20 వరల్డ్ కప్ తర్వాత ఆ పదవి నుండి తప్పుకున్న రవిశాస్త్రి స్థానంలో భారత మాజీ కెప్టెన్ ద్రవిడ్ హెడ్ కోచ్‌గా నియమితులయ్యారు.