Loading...
IND vs SL: మూడో రోజు ఆటకు వరుణుడి బ్రేక్‌.. 238 పరుగులు వెనుకంజలో లంక
మూడో రోజు ఆటకు వరుణుడి బ్రేక్‌.. 238 పరుగులు వెనుకంజలో లంక

IND vs SL: మూడో రోజు ఆటకు వరుణుడి బ్రేక్‌.. 238 పరుగులు వెనుకంజలో లంక

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 25, 2026
05:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా, శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో మూడో రోజు ఆట ముగిసింది. 84వ ఓవర్‌లో రవీంద్ర జడేజా బౌలింగ్‌ చేస్తుండగా వర్షం ప్రారంభమైంది. దీంతో ఆటగాళ్లు వెంటనే డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లిపోయారు. స్టేడియం సిబ్బంది మైదానాన్ని కవర్లతో పూర్తిగా కప్పేశారు. వర్షం కారణంగా ఆటను కొనసాగించే అవకాశం లేకపోవడంతో కొంత సమయం వేచి చూసిన అనంతరం 83.4 ఓవర్ల వద్ద మూడో రోజు ఆటను ముగిస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఆట ముగిసే సమయానికి శ్రీలంక 265/8 పరుగులు చేసింది.

వివరాలు

మూడు వికెట్లు పడగొట్టిన మానవ్‌ సుతార్‌  

క్రీజులో లాహిరు 8 పరుగులతో, సోనల్‌ 85 పరుగులతో ఉన్నారు. భారత బౌలర్లలో ప్రసిద్ధ్‌ కృష్ణ, మానవ్‌ సుతార్‌ ఇప్పటివరకు మూడేసి వికెట్లు పడగొట్టారు.

మహ్మద్‌ సిరాజ్‌, రవీంద్ర జడేజా చెరో వికెట్‌ తీశారు.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 503/9 వద్ద డిక్లేర్‌ చేయగా.. శ్రీలంక ప్రస్తుతం 238 పరుగులు వెనుకంజలో ఉంది.

ADVERTISEMENT