IND w Vs SA w: వరల్డ్‌కప్ ఫైనల్‌కు వర్షం ముప్పు.. వరుణుడు రంగంలోకి దిగుతాడా?
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియాపై అభిమానులంతా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తొలిసారిగా మహిళల వన్డే ప్రపంచకప్‌ను మన అమ్మాయిలు కైవసం చేసుకుంటారని దేశం మొత్తం ఎదురు చూస్తోంది. ఇదే సమయంలో దక్షిణాఫ్రికా మహిళా జట్టు కూడా తమ తొలి వరల్డ్‌కప్ ట్రోఫీ కోసం బరిలోకి దిగుతోంది. అయితే ఈ ఉత్కంఠభరిత పోరులో మధ్యలో వరుణుడు ఆటంకం కలిగించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫైనల్ మ్యాచ్‌కు వేదికగా ఉన్న నవీ ముంబయిలో వర్షం కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. రిజర్వ్‌డే (నవంబర్ 3) ఉన్నప్పటికీ, ఆ రోజు కూడా వర్షం పడితే ఫలితం ఎలా తేలుస్తారన్న అనుమానాలు అభిమానుల్లో తలెత్తుతున్నాయి. ఇప్పుడు నవీ ముంబయి వాతావరణ పరిస్థితులను, మ్యాచ్ సమయానికి వర్ష సూచనలను ఆక్యూ వెదర్ వివరించింది.
Details
ఫైనల్ మ్యాచ్ వివరాలు
భారత్ vs దక్షిణాఫ్రికా మహిళల ప్రపంచకప్ ఫైనల్ డీవై పాటిల్ మైదానంలో జరగనుంది. మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది, టాస్ 2.30 గంటలకు వేస్తారు. టాస్ గెలిచే జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశముంది.
Details
వాతావరణ అంచనా
ప్రస్తుతం నవీ ముంబయిలో వాతావరణం పొడిగా ఉంది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో మబ్బులు కమ్ముకునే అవకాశం ఉంది. మ్యాచ్ ప్రారంభానికి ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు. ఈ సమయానికి వర్షం పడే అవకాశాలు కేవలం 20% మాత్రమే. అయితే ఆట సాగేకొద్దీ వర్షం వచ్చే అవకాశం పెరుగుతుంది. సాయంత్రం 4 గంటలకు వర్షం పడే శాతం 49%, 5 గంటలకి 51% గా ఉందని వాతావరణ నివేదిక చెబుతోంది. సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య వర్షం ఆగిపోవచ్చు, ఆ తర్వాత ఆట సజావుగా సాగే అవకాశం ఉంది. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచితే, పునఃప్రారంభానికి కొంత సమయం పట్టవచ్చు.
Details
రిజర్వ్‌డే పరిస్థితి
ఒకవేళ వర్షం కారణంగా ఇవాళ మ్యాచ్ పూర్తిగా రద్దయితే రేపు (రిజర్వ్‌డే)కి వాయిదా పడుతుంది. అయితే రేపు కూడా వర్షం ఆటంకం కలిగిస్తే కనీసం 20 ఓవర్లు పూర్తయితేనే డీఎల్‌ఎస్ పద్ధతిలో విజేతను నిర్ణయిస్తారు. లేకపోతే ఇరుజట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. అందుకే అభిమానులంతా ఇప్పుడు ఒకే ఆకాంక్షతో ఎదురుచూస్తున్నారు. వర్షం రాకుండా ఫైనల్ సజావుగా జరిగి, టీమిండియా చరిత్ర సృష్టించాలి