IPL 2026: దుమ్ములేపిన వైభవ్.. ఆర్సీబీపై రాజస్థాన్ ఘన విజయం
ఈ వార్తాకథనం ఏంటి
గౌహతి వేదికగా జరిగిన ఐపీఎల్ 2026 ఉత్కంఠభరిత మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (78) విధ్వంసకర బ్యాటింగ్‌తో పాటు ధ్రువ్ జురెల్ (81 నాటౌట్) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడడంతో ఆర్‌సీబీపై రాజస్థాన్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన రాజస్థాన్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ లక్ష్యాన్ని ఆత్మవిశ్వాసంతో ఛేదించింది.
వివరాలు
ప్రారంభంలోనే షాక్..
బెంగళూరు ఇన్నింగ్స్‌లో ఓపెనర్ ఫిల్ సాల్ట్ (0) గోల్డెన్ డక్ కావడంతో జట్టు ప్రారంభంలోనే ఒత్తిడిలో పడింది. అనంతరం కెప్టెన్ రజత్ పాటిదార్ కీలకమైన కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. విరాట్ కోహ్లీ (36), రొమారియో షెపర్డ్ (22) కూడా రాణించడంతో జట్టు కొంత బలపడింది. చివర్లో వెంకటేష్ అయ్యర్ (29) వేగంగా ఆడడంతో ఆర్‌సీబీ స్కోరు 200 దాటింది. అయితే దేవదత్ పడిక్కల్ (14), టీమ్ డేవిడ్ (13), జితేష్ శర్మ (5), కృనాల్ పాండ్యా (1) పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. 202 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన రాజస్థాన్‌కు ప్రారంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (13) త్వరగానే అవుటయ్యాడు.
వివరాలు
బౌలర్లపై వరుస దాడులు..
కానీ ఆ తర్వాత వైభవ్ సూర్యవంశీ ఆర్‌సీబీ బౌలర్లపై దాడి చేశాడు. కేవలం 15 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసి, వరుసగా రెండోసారి ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. మొత్తం 26 బంతుల్లో 78 పరుగులు చేసిన అతను 8 ఫోర్లు, 7 సిక్సర్లు బాదాడు. కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అతను పెవిలియన్ చేరాడు. వైభవ్ అవుటైన వెంటనే షిమ్రాన్ హెట్‌మయర్ (0) కూడా కృనాల్ పాండ్యా చేతిలోనే అవుటయ్యాడు.
వివరాలు
పాయింట్ల పట్టికలో నెంబర్ వన్
తర్వాత కెప్టెన్ రియాన్ పరాగ్ (3) కూడా త్వరగా వెనుదిరగడంతో రాజస్థాన్ 134 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో ధ్రువ్ జురెల్ అద్భుతంగా ఆడి హాఫ్ సెంచరీ సాధించి జట్టును విజయతీరాలకు నడిపించాడు. రవీంద్ర జడేజా (24 నాటౌట్) కూడా చక్కటి సహకారం అందించడంతో రాజస్థాన్ విజయం సాధించింది. ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో తన అగ్రస్థానాన్ని మరింత బలపరుచుకుంది. ఆర్‌సీబీ బౌలర్లలో జోష్ హేజిల్‌వుడ్, కృనాల్ పాండ్యా చెరో రెండు వికెట్లు తీశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న వీడియో..
Back-to-back breakthroughs when #RCB needed it the most 👊
— IndianPremierLeague (@IPL) April 10, 2026
🎥 Krunal Pandya doing the damage 👏
Updates ▶️ https://t.co/X76bJjmq1j#TATAIPL | #KhelBindaas | #RRvRCB | @RCBTweets pic.twitter.com/KSXAgY6dgv