LOADING...
Vaibhav Suryavanshi: నెట్స్‌లో తొలి బంతికే సిక్స్… వైభవ్ టాలెంట్‌కు ఫిదా అయిన రాజస్థాన్
నెట్స్‌లో తొలి బంతికే సిక్స్… వైభవ్ టాలెంట్‌కు ఫిదా అయిన రాజస్థాన్

Vaibhav Suryavanshi: నెట్స్‌లో తొలి బంతికే సిక్స్… వైభవ్ టాలెంట్‌కు ఫిదా అయిన రాజస్థాన్

వ్రాసిన వారు Moogati Shabari
May 07, 2026
10:26 am

ఈ వార్తాకథనం ఏంటి

కేవలం 15 ఏళ్ల వయసున్న ఈ యువ బ్యాట్స్‌మన్, తన విధ్వంసకర బ్యాటింగ్‌తో భారత క్రికెట్‌లో పెద్ద సంచలనం సృష్టిస్తున్నాడు. వైభవ్ క్రీజులో ఉంటే బౌలర్లు ఒత్తిడికి లోనవడం ఖాయం అన్నట్లుగా అతని దూకుడు కనిపిస్తోంది. భారీ షాట్లతో, ఫోర్లు-సిక్సులతో గ్రౌండ్‌ను ఉర్రూతలూగిస్తున్న అతని ఆటకు ప్రపంచ క్రికెట్ అభిమానులే ఫిదా అవుతున్నారు. ఇప్పటి ఐపీఎల్ సీజన్‌లో అతను 10 మ్యాచ్‌ల్లోనే 404 పరుగులు చేశాడు. అందులో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కేవలం 36 బంతుల్లో చేసిన సెంచరీ కూడా ప్రత్యేకంగా నిలిచింది.

వివరాలు

అతని బ్యాటింగ్ అద్భుతం..

2024 మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ అతన్ని రూ.1.10 కోట్లకు సొంతం చేసుకుంది. అయితే వైభవ్ బ్యాటింగ్‌ను ట్రయల్స్‌లో చూసిన వెంటనే అతన్ని తీసుకోవాలనే నిర్ణయం ఫ్రాంచైజీ తీసుకుందని సమాచారం. ఈ విషయాన్ని రాజస్థాన్ రాయల్స్ క్రికెట్ డైరెక్టర్ జుబిన్ భరూచా వెల్లడించారు. ఆయన చెప్పిన ప్రకారం, ట్రయల్ క్యాంప్ మొదటి రోజే వైభవ్ చూపిన ప్రభావం అంత తీవ్రంగా ఉండడంతో జట్టు తమ వేలం ప్రణాళికనే మార్చుకోవాల్సి వచ్చిందట.

వివరాలు

ఫుల్ ఫామ్‌లో ఉన్న వైభవ్..

విస్డెన్ క్రికెట్‌తో మాట్లాడుతూ భరూచా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నెట్స్‌లో వైభవ్ సూర్యవంశీ ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలచడంతో అందరూ ఆశ్చర్యపోయారని చెప్పారు. సంజు శాంసన్, యశస్వి జైస్వాల్ వంటి ప్రతిభావంతులను దగ్గరగా చూశానని, కానీ వైభవ్ స్థాయి మాత్రం పూర్తిగా భిన్నమని ఆయన అభిప్రాయపడ్డారు. ట్రయల్స్ సమయంలో ఎడమచేతి ఫాస్ట్ బౌలర్ వేసిన ఇన్‌స్వింగింగ్ బంతిని వైభవ్ అద్భుతంగా సిక్సర్‌గా మలిచాడట. ఆ తర్వాత అతని ప్రతిభను మరింతగా పరీక్షించాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇతర ఆటగాళ్లను పంపించి, వైభవ్‌ను మళ్లీ పిలిపించి, పొడవైన, అత్యంత వేగవంతమైన త్రోడౌన్ స్పెషలిస్టులతో కఠినమైన పరీక్ష పెట్టారు.

Advertisement

వివరాలు

సచిన్ రికార్డులు సాధిస్తాడా?

అప్పుడు భరూచా బౌలర్‌ను పూర్తిగా శక్తితో బౌలింగ్ చేయమని సూచించారు. ప్రారంభంలో కొన్ని బంతులను వదిలేసిన వైభవ్, వెంటనే తరువాతి బంతిని నేరుగా సైట్‌స్క్రీన్‌పైకి పంపాడట. అదే క్షణంలో అతను సాధారణ ఆటగాడు కాదని తనకు స్పష్టమైందని భరూచా తెలిపారు. ఆ వెంటనే ఆయన రాజస్థాన్ రాయల్స్ సీఈఓ జాక్ లష్ మెక్‌క్రమ్‌కు మెసేజ్ పంపారట. అందులో "ఇలాంటి ఆటగాడు ఒక తరం తర్వాత ఒక్కసారి మాత్రమే దొరుకుతాడు. సచిన్ టెండూల్కర్ తర్వాత నేను ఇలాంటి బ్యాట్స్‌మన్‌ను చూడలేదు" అని పేర్కొన్నట్లు భరూచా వెల్లడించారు.

Advertisement