Page Loader
CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ రాయల్స్ సూపర్ విక్టరీ
చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ రాయల్స్ సూపర్ విక్టరీ

CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ రాయల్స్ సూపర్ విక్టరీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 30, 2025
11:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాజస్థాన్‌ రాయల్స్‌ ఐపీఎల్‌ 18లో విజయంతో తన ఖాతా తెరిచింది. చైన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన పోరులో రాజస్థాన్‌ 6 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ 182/9 పరుగులు చేసింది. నితీశ్‌ రాణా (81; 36 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. అనంతరం 183 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కే 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులకే పరిమితం అయింది. కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (63; 44 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధశతకంతో రాణించాడు. ఓపెనర్‌ రచిన్‌ రవీంద్ర తొలి ఓవర్‌లోనే డకౌట్‌గా వెనుదిరిగాడు.

Details

నాలుగు వికెట్లతో చెలరేగిన వనిందు హసరంగ

రాహుల్‌ త్రిపాఠి (23), శివమ్‌ దూబే (18), ధోనీ (16), విజయ్‌ శంకర్‌ (9) స్వల్ప స్కోర్లు చేశారు. చివరి ఓవర్లో చెన్నైకి గెలవాలంటే 20 పరుగులు అవసరం కాగా.. 13 పరుగులు మాత్రమే వచ్చాయి. రాజస్థాన్‌ బౌలర్లలో వనిందు హసరంగ 4 వికెట్లు తీసి చెలరేగాడు. చెన్నై వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది. రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 182 పరుగులు చేసింది. వన్‌డౌన్‌ బ్యాటర్‌ నితీశ్‌ రాణా భారీ ఇన్నింగ్స్‌ ఆడాడు. పరాగ్ (37; 28బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), సంజు శాంసన్ (20; 16 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్‌), హెట్‌మయర్ (19; 16 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్‌) మద్దతునిచ్చారు.

Details

 నితీశ్‌ రాణా మెరుపు బ్యాటింగ్‌ 

చెన్నై బౌలర్లలో నూర్‌ అహ్మద్‌, అహ్మద్‌, పతిరన తలో రెండు వికెట్లు తీశారు. ఖలీల్ అహ్మద్‌ వేసిన తొలి ఓవర్‌లోనే జైస్వాల్ బౌండరీ బాదినా, మూడో బంతికే క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన నితీశ్‌ రాణా ఆరంభం నుంచే అటాకింగ్‌ మోడ్‌లోకి వెళ్లిపోయాడు. ఖలీల్‌ బౌలింగ్‌లో ఫోర్‌ కొట్టి ఖాతా తెరిచిన నితీశ్‌, ఓవర్టన్‌, అశ్విన్‌లపై విరుచుకుపడ్డాడు. ఓవర్టన్ వేసిన తొలి రెండు ఓవర్లలో మూడు ఫోర్లు, ఒక సిక్స్‌ కొట్టాడు. అశ్విన్‌ వేసిన ఐదో ఓవర్‌లో వరుసగా 6, 6, 4 బాది దూకుడు పెంచాడు. ఖలీల్‌ వేసిన ఆరో ఓవర్‌లో రెండు ఫోర్లు, ఓ సిక్స్‌తో చెలరేగి 21 బంతుల్లో అర్ధశతకం సాధించాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

6 పరుగుల తేడాతో రాజస్థాన్ విజయం