LOADING...
CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం
చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం

CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం

వ్రాసిన వారు Jayachandra Akuri
May 20, 2025
11:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంగా వేదికగా ఇవాళ చైన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచులో రాజస్థాన్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన చైన్నై 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. లక్ష్య చేధనలో రాజస్థాన్ 4 వికెట్లు కోల్పోయి 17.1 ఓవర్లలోనే టార్గెట్‌ను చేధించింది. రాజస్థాన్ బ్యాటర్లలో వైభవ్ సూర్యవంశీ (57) హాఫ్ సెంచరీతో చెలరేగగా, యశస్వీ జైస్వాల్ (36), కెప్టెన్ సంజు శాంసన్ 41 పరుగులతో రాణించారు. చివర్లో ధ్రువ్ జురుల్ (31) బౌండరీల వర్షం కురిపించారు. చైన్నై బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 2, పతిరణ, అన్షుల్ కాంబోజ్ తలా ఓ వికెట్ తీశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

హాఫ్ సెంచరీతో వైభవ్ సూర్యవంశీ