
PBKS vs RR: పంజాబ్‌పై రాజస్థాన్ రాయల్స్ విజయం
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2025 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ అదరగొట్టింది. తాజాగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో 50 పరుగుల తేడాతో గెలుపొంది సత్తా చాటింది.
మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు భారీ స్కోరు చేసింది.
లక్ష్య చేధనలో పంజాబ్ తొమ్మిది వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ 50 పరుగుల తేడాతో గెలుపొందింది.
నేహల్ వధేరా 41 బంతుల్లో 62 పరుగులు ( 4 ఫోర్లు, 3 సిక్సర్లు ), మాక్స్‌వెల్ 21 బంతుల్లో 30 పరుగులు ( 3 ఫోర్లు, ఒక సిక్సర్) కాసేపు పోరాడినా ఫలితం లేకుండా పోయింది.
Details
తేలిపోయిన పంజాబ్ బ్యాటర్లు
ప్రియన్షు ఆర్య (0), ప్రభుమాన్ సింగ్(17), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(10), స్టోయినిస్ (1) దారుణంగా నిరాశపరిచారు.
రాజస్థాన్ బౌలర్లలో ఆర్చర్ 3, సందీప్ శర్మ, తీక్షణ చెరో వికెట్లు తీసి ఫర్వాలేదనిపించారు.
ఇక కుమార్ కార్తికేయ, హసరంగ చేరో వికెట్ తీశారు. ఈ సీజన్ లో పంజాబ్ కింగ్స్ ఇది తొలి ఓటమి కాగా, రాజస్థాన్ రాయల్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
50 పరుగుల తేడాతో రాజస్థాన్ గెలుపు
Match 18. Rajasthan Royals Won by 50 Run(s) https://t.co/kjdEJydDWe #PBKSvRR #TATAIPL #IPL2025
— IndianPremierLeague (@IPL) April 5, 2025