
Rajat Patidar: ముంబైతో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా రజత్ పాటిదార్‌కు భారీ జరిమానా
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ టోర్నమెంట్‌లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించిన సంగతి తెలిసిందే.
అయితే ఈ మ్యాచ్ అనంతరం ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్‌కు ఐపీఎల్ కౌన్సిల్ భారీ జరిమానా విధించింది.
అతడికి రూ.12లక్షల జరిమానా విధించారు.మ్యాచ్ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా మెల్లగా ఓవర్లు వేయడం వల్ల,ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2 ప్రకారం ఈ చర్య తీసుకున్నారు.
ముంబై,బెంగళూరు జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్ పూర్తిగా ఉత్కంఠభరితంగా సాగింది.
ఈ పోరులో రజత్ పాటిదార్ అద్భుతమైన నాయకత్వాన్ని ప్రదర్శించాడు.ముంబై బౌలర్లపై విరుచుకుపడి,నాలుగు సిక్సర్లు, ఐదు బౌండరీలతో 32 బంతుల్లో 64 పరుగులు చేసి తన జట్టును విజయతీరాలకు చేర్చడంలో ప్రధాన పాత్ర పోషించాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
స్లో ఓవర్ రేట్ కారణంగా రూ.12 లక్షల ఫైన్
Rajat Patidar has been fined 12 Lakhs for the slow Over-rate against Mumbai Indians. 🏆 pic.twitter.com/sDZjWXZQ9i
— Johns. (@CricCrazyJohns) April 8, 2025