Loading...
Rakul Preet Singh: నా పరువుకు భంగం కలిగించేలా వార్తలు.. ఐటీ దాడులపై రకుల్‌ ఫైర్
నా పరువుకు భంగం కలిగించేలా వార్తలు.. ఐటీ దాడులపై రకుల్‌ ఫైర్

Rakul Preet Singh: నా పరువుకు భంగం కలిగించేలా వార్తలు.. ఐటీ దాడులపై రకుల్‌ ఫైర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 06, 2026
10:48 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల ముంబయిలో జరిగిన ఆదాయ పన్ను (ఐటీ) శాఖ దాడులతో తనకు ఎలాంటి సంబంధం లేదని నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్పష్టం చేశారు. విదేశీ నిధుల మళ్లింపునకు సంబంధించిన ఆరోపణలతో తన పరువుకు భంగం కలిగించేలా వస్తున్న వార్తలపై ఆమె తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు. 'నేను ఆర్మీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చాను. చిత్ర పరిశ్రమలో నాకు ఎలాంటి గాడ్‌ఫాదర్లు లేరు. స్వయం కృషితోనే ఈ స్థాయికి వచ్చాను. 20 ఏళ్ల వయసు నుంచే క్రమం తప్పకుండా పన్నులు చెల్లిస్తున్న బాధ్యతాయుతమైన పౌరురాలిని.

వివరాలు

ఎలాంటి బహుమతి ఇవ్వలేదు

వ్యక్తిగతంగా కానీ, ఏ నిర్మాణ సంస్థ తరఫున కానీ ఎలాంటి చట్టవిరుద్ధమైన విదేశీ లావాదేవీలు నేను చేయలేదు.

దేశంలో కానీ, విదేశాల్లో కానీ నా పేరిట ఎలాంటి బినామీ ఆస్తులు లేవు. ఎవరూ నాకు ఎలాంటి ఆస్తులను బహుమతిగా ఇవ్వలేదు.

అలాంటి ఖరీదైన కానుకలను స్వీకరించడం నా సూత్రాలకు పూర్తిగా విరుద్ధం.

ఆధారాలు లేని సంచలన వార్తలతో ఇతరుల ప్రతిష్ఠను, జీవితాలను దెబ్బతీయడం సరికాదని రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

ADVERTISEMENT