
Ravichandran Ashwin: ఇంగ్లండ్‌పై రవిచంద్రన్ అశ్విన్ 100 టెస్టు వికెట్లు పూర్తి
ఈ వార్తాకథనం ఏంటి
రాంచీ వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది.ఈ మ్యాచ్ తో టెస్టు క్రికెట్ లో ఇంగ్లండ్ పై 100 వికెట్లు తీసిన తోలి భారత బౌలర్ గా రవిచంద్రన్ అశ్విన్ నిలిచారు.
అశ్విన్ తన అద్భుతమైన బౌలింగ్ తో జానీ బైయిర్ స్టోను అవుట్ చేసి ఈ ఘనత సాధించారు.
కాగా,అశ్విన్ ఈ మధ్యే టెస్టులో 500 వికెట్లు పూర్తి చేసుకున్నారు. అశ్విన్ భారతదేశంలో, 86 వికెట్లు తియ్యగా మిగిలిన 14 ఇంగ్లాండ్‌లో వచ్చాయి.
ప్రస్తుతం జరుగుతున్న సిరీస్‌లో అశ్విన్ 12 వికెట్లు పడగొట్టాడు. అతను హైదరాబాద్‌లో 3/68, 3/126 తీసుకున్నాడు.
విశాఖపట్టణంలో అశ్విన్ 0/61,3/72 గణాంకాలను నమోదు చేశాడు. రాజ్‌కోట్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో ఒక్కో వికెట్ తీశాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఇంగ్లండ్ పై 100 వికెట్లు తీసిన తోలి భారత బౌలర్ అశ్విన్
Ravichandran Ashwin completes 100 test wickets against England
— Crease Craze (@CrazeCrease) February 23, 2024
#INDvsENG #INDvENG #INDvsENGTest pic.twitter.com/pe1f9GDLF3