Page Loader
ఐసీసీ ర్యాకింగ్స్‌లో మళ్లీ నంబర్ వన్‌గా రవిచంద్రన్ అశ్విన్
బౌలర్ల జాబితాలో నంబర్ స్థానంలో కొనసాగుతున్న అశ్విన్

ఐసీసీ ర్యాకింగ్స్‌లో మళ్లీ నంబర్ వన్‌గా రవిచంద్రన్ అశ్విన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 15, 2023
03:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

అంతర్జాతీయ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌ను తాజాగా అంతర్జాతీయ కౌన్సిల్ విడుదల చేసింది. గతంలో టీమిండియా బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ తో పాటు ఇంగ్లాండ్ స్పీడ్ స్టార్ అండర్సన్ ఇద్దరు 859 పాయింట్లతో సమానంగా నిలిచారు. ప్రస్తుతం రవిచంద్రన్ అశ్విన్ పది పాయింట్లను మెరుగుపరుచుకొని నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్‌లో జరుగుతున్న 4వ టెస్టులో అశ్విన్ ఏడు వికెట్లను పడగొట్టడంతో ఏకంగా 10 పాయింట్లను సాధించి, 869 పాయింట్లతో అండర్సన్‌ను వెనక్కి నెట్టాడు. టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 7వ స్థానంలో కొనసాగుతున్నాడు.

రవీంద్ర జడేజా

ఆల్ రౌండర్ జాబితాలో రవీంద్ర జడేజా అగ్రస్థానం

ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్ 6/91, రెండో ఇన్నింగ్స్‌లో 1/57తో సత్తా చాటాడు. ముఖ్యంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో అశ్విన్ 25 వికెట్లతో విజృంభించిన విషయం తెలిసిందే. టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో పాట్ కమిన్స్, కగిసో రబాడ, షాహీన్ అఫ్రిది టాప్-5లో ఉన్నారు. జస్ప్రీత్ బుమ్రా 7వ స్థానానికి పడిపోయారు. అహ్మదాబాద్‌ జరిగిన టెస్టు మ్యాచ్‌లో నాథన్ లియాన్ మూడు వికెట్లను సాధించడంతో తాజాగా 8వ స్థానానికి చేరుకున్నాడు. టెస్టుల్లో ఆల్ రౌండర్ జాబితాలో రవీంద్ర జడేజా అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. రవిచంద్రన్ అశ్విన్ రెండో స్థానంలో ఉన్నాడు.