Page Loader
ఇలా అయితే బౌలింగ్ జాబ్ వదిలేస్తానన్న అశ్విన్
టీమిండియా ప్లేయర్లు పుజారా, అశ్విన్

ఇలా అయితే బౌలింగ్ జాబ్ వదిలేస్తానన్న అశ్విన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 14, 2023
03:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను టీమిండియా 2-1 తేడాతో గెలుచుకున్న విషయం తెలిసిందే. దీంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమిండియా వరుసగా నాలుగోసారి గెలుచుకుంది. అటు తొలిటెస్టులో న్యూజిలాండ్ చేతిలో శ్రీలంక ఓడిపోవడంతో డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తును టీమిండియా కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పుజారా బౌలర్‌గా అవతారమెత్తడంతో రవిచంద్రన్ అశ్విన్ ఫన్నీగా అతడికి కౌంటర్ ఇచ్చాడు. పుజారా బౌలింగ్ చేస్తే తాను ఏమీ చేయాలని, బౌలింగ్ జాబ్ మానుకోవాలా అని అశ్విన్ ఫన్నీగా పోస్టు చేశాడు. ఈ పోస్టుకు పుజారా బౌలింగ్ చేస్తున్న ఫోటోను అశ్విన్ జత చేశాడు.

అశ్విన్

అశ్విన్ ట్విట్‌కు పుజారా ఫన్నీ రిప్లే

అశ్విన్ ట్విట్‌పై పుజారా కూడా స్పందించాడు. నాగ్ పూర్ టెస్టులో అశ్విన్ వన్డౌన్‌లో బ్యాటింగ్ దిగాడని, అందుకే ఇలా థ్యాంక్సు చెబుతున్నానని పుజారా ఫన్నీగా రిప్లే ఇచ్చాడు. అనంతరం వీరద్దరి సంభాషణ ఆద్యంతం ఫన్నీగా సాగింది. నెటిజన్లు కూడా వీరి ట్విట్లపై విపరీతంగా స్పందించడమే కాకుండా కామెంట్ల రూపంలో తమ స్పందనను తెలియజేశారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అశ్విన్ 25 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. జడేజా 22 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. వీరిద్దరికి మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌ని సంయుక్తంగా అందజేశారు.