Page Loader
అక్షయ్‌కుమార్ మూవీ సీన్‌పై టీమిండియా క్రికెటర్ల ఫన్నీ వీడియో
మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా ఎంపికైన అశ్విన్, జడేజా

అక్షయ్‌కుమార్ మూవీ సీన్‌పై టీమిండియా క్రికెటర్ల ఫన్నీ వీడియో

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 14, 2023
10:28 am

ఈ వార్తాకథనం ఏంటి

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' గా ఎంపికయ్యారు. ఆస్ట్రేలియాపై 2-1 తేడాతో విజయం సాధించిన తర్వాత అక్షయ్ కుమార్ మూనీ సీన్‌పై ఓ వీడియో చేశారు. ఈ వీడియోను రవిచంద్రన్ అశ్విన్ తన ఫేస్ బుక్ ప్రొఫైల్‌లో పోస్టు చేశాడు. ఈ వీడియోలో జడేజా, అశ్విన్ రౌడీ రాథోడ్ మూవీ సీన్ లోని 'ఏక్ తేరా ఏక్ మేరా' కామెడీ సీన్ చేసి నవ్వులు పూయించారు. ఆ తర్వాత ఇద్దరూ RRR పాటలోని నాటు నాటు సాంగ్ పాటకు ఒకరికి ఒకరు చేతులు వేసుకొని స్టైల్‌గా నడుచుకుంటూ వెళ్తారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ వీడియోలో వైరల్ అయింది.

జడేజా

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో జడేజా, అశ్విన్ అద్భుత ప్రదర్శన

నాటు నాటు పాటకు ఎంతోమంది స్టెప్పులు వేస్తూ నెట్టింట్లో సందడి చేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా చేరారు. ఆస్ట్రేలియాతో జరిగిన మొత్తం సిరీస్ లో అశ్విన్, జడేజా అద్భుత ప్రదర్శన చేశారు. ఈ సిరీస్ లో అశ్విన్ 25 వికెట్లు పడగొట్టి, 86 పరుగులు చేశాడు. రవీంద్ర జడేజా 22 వికెట్లు తీసి 135 పరుగులు చేశారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ టైటిల్ ను అందుకున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రౌడీరాథోడ్ మూవీ సీన్‌లో టీమిండియా క్రికెటర్లు