IND vs AUS: మూడో టెస్టులో అశ్విన్‌ను ఊరిస్తున్న నెం.1 రికార్డు
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మూడో టెస్టులో అశ్విన్ మరో అరుదైన రికార్డుపై కన్నేశాడు. ఆస్ట్రేలియా బ్యాటర్ల నడ్డి విరిచిన అశ్విన్ ఇప్పటికే అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. నాగ్‌పూర్, ఢిల్లీ వేదికగా జరిగిన రెండు టెస్టులో అశ్విన్ 14 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ మరో 9 వికెట్లు పడగొడితే ఈ ట్రోఫి చరిత్రలోనే అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేస్తాడు. ఇప్పటివరకూ ఈ రికార్డులో అనిల్ కుంబ్లే 111 వికెట్లతో టాప్‌లో ఉన్నాడు. అశ్విన్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇప్పటికే 103 వికెట్లు పడగొట్టాడు. అదేవిధంగా అంతర్జాతీయ క్రికెట్‌లో కపిల్‌దేవ్ 687 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ మరో వికెట్లు ఇస్తే కపిల్‌దేవ్ రికార్డు కనుమరుగు కానుంది.
అరుదైన రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ, కోహ్లీ
కెప్టెన్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో 3000 పరుగులు పూర్తి చేయడానికి రోహిత్ శర్మ 80 పరుగుల దూరంలో ఉన్నాడు. రోహిత్ శర్మ మరో 57 పరుగులు చేస్తే స్వదేశంలో ఆడిన టెస్టులో 2000 పరుగులు పూర్తి చేసే అవకాశం ఉంటుంది. స్వదేశంలో ఆడిన టెస్టుల్లో 4000 పరుగులు పూర్తి చేసేందుకు విరాట్ కోహ్లీ 77 పరుగుల దూరంలో ఉన్నాడు. తొలి టెస్టులో భారత్ 132 పరుగుల తేడాతో గెలవగా.. ఢిల్లీ టెస్టులో 6 వికెట్ల తేడాతో విజయం టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే.