Ravindra Jadeja : జడేజా ప్రపంచ రికార్డు.. 600 వికెట్లు పూర్తి
ఈ వార్తాకథనం ఏంటి
ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత క్రికెట్ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ ఆటగాడు రవీంద్ర జడేజా భారీ ఘనత సాధించాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో 600 వికెట్లు తీసిన 5వ భారత బౌలర్‌గా నిలిచాడు. తొలి వన్డేలో మూడో వికెట్ తీసిన వెంటనే ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో 9 ఓవర్లు బౌలింగ్ చేసి 1 మెయిడిన్ ఓవర్‌తో కేవలం 26 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.
వివరాలు
దిగ్గజాల జాబితాలోకి జడేజా
జడేజా తన 352వ అంతర్జాతీయ మ్యాచ్‌లో 600 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. అతను 2009 సంవత్సరంలో భారతదేశం తరపున తన మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో అనిల్ కుంబ్లే (953), రవిచంద్రన్ అశ్విన్ (765), హర్భజన్ సింగ్ (707), కపిల్ దేవ్ (687) లు భారత్ తరుపున ఎక్కువ వికెట్లు ఉన్నాయి.
భారత్ నుంచి ఈ ఘనత సాధించిన తొలి లెఫ్టార్మ్ స్పిన్ బౌలర్ జడేజా. ఈ ఆటగాడు టీ-20 అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు.