LOADING...
రవీంద్ర జడేజాకు గొప్ప మనసు.. ఆ క్రికెటర్‌కి విన్నింగ్ షాట్ కొట్టి బ్యాట్ గిప్ట్
రవీంద్ర జడేజా

రవీంద్ర జడేజాకు గొప్ప మనసు.. ఆ క్రికెటర్‌కి విన్నింగ్ షాట్ కొట్టి బ్యాట్ గిప్ట్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 01, 2023
03:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్‌లో చైన్నై విజయానికి కీలకపాత్ర పోషించిన రవీంద్ర జడేజా.. మరో మంచి పని చేసి యంగ్ ప్లేయర్ మనసును గెలుచుకున్నాడు. మే29న జరిగిన ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ పై జడేజా విన్నింగ్ షాట్ కొట్టి సీఎస్కేను గెలిపించాడు. ఫలితంగా ఐపీఎల్‌లో అత్యధిక ట్రోఫీలు గెలుచుకున్న జట్టుగా ముంబై ఇండియన్స్ ని సమం చేసింది. చివరి రెండు బంతుల్లో 10 పరుగులు కావాల్సిన సమయంలో జడేజా చివరి రెండు బంతులకు వరుసగా సిక్సర్, ఫోర్ బాది చైన్నై అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. ఏ బ్యాట్ తో సిక్సర్, ఫోర్ కొట్టి సీఎస్కేకి విజయాన్ని అందించాడో దాన్ని ఐపీఎల్ డెబ్యూ కూడా చేయని యువ ఆటగాడికి గిఫ్ట్ ఇచ్చి పెద్ద మనసును చాటుకున్నాడు.

Details

రవీంద్ర జడేజాకు కృతజ్ఞతలు తెలిపిన అజయ్

చైన్నై విజయం అనతరం జడేజా, చైన్నై జట్టుతో డ్రెసింగ్ రూమును పంచుకున్న అజయ్ మండల్ కు తన బ్యాట్ ను బహుమతిగా అందజేశాడు. ఈ విషయాన్ని అజయ్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశాడు. రవీంద్ర జడేజా తనకు బ్యాట్ బహుమతిగా ఇచ్చినందకు కృతజ్ఞతలని, జడేజాతో కలిసి డ్రెస్సింగ్ రూమును పంచుకోవడానికి అవకాశం కల్పించిన చైన్నై జట్టుకు ప్రత్యేకంగా రుణపడి అజయ్ ఉంటానని స్పష్టం చేశాడు. అజయ్ మండల్ దేశవాళీ క్రికెట్లో ఛత్తీస్‌గఢ్ తరుపున ఆడుతున్నాడు. మధ్యప్రదేశ్ జన్నించిన అతన్ని చైన్నై ఈ సీజన్లో రూ.20లక్షల బేస్ ధరకు కొనుగోలు చేసింది. అయితే ఈ సీజన్లో అతను ఒక్క ఐపీఎల్ మ్యాచను కూడా ఆడలేదు.